Homeఎంటర్టైన్మెంట్Indian 2: త్వరలో షూటింగ్ స్టార్ట్ అవనున్న ఇండియన్ 2

Indian 2: త్వరలో షూటింగ్ స్టార్ట్ అవనున్న ఇండియన్ 2

Indian 2: డైరెక్టర్ శంకర్ చిత్రాలంటే భారీ బడ్జెట్ తో నిర్మిస్తారు. అలానే ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే వసూళ్లు చేస్తాయి. లోకనాయకుడు కమల్ హాసన్ – శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం “ఇండియన్‌” తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో ” భారతీయుడు” గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ” ఇండియన్ 2″  చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

indian 2 movie makers planning to complete the movie shoot

ఇండియన్ 2 ఫిలింని  లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి చేసుకొని చివరి దశలో ఉంది.  అయితే డైరెక్టర్ శంకర్ కి,  లైకా ప్రొడక్షన్స్‌ వారికి  మధ్య విభేదాలు రావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్లీ సెట్స్‌ పైకి తీసుకెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి ఈ సినిమాను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్‌సీ 15 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్‌ చేస్తున్నాడు. అయితే ఈ రెండు చిత్రాల కన్నా ఇండియన్ 2  చిత్రాన్ని ముందు పూర్తి చేసి విడుదల చేస్తాడా లేదా ఈ రెండు చిత్రాల తర్వాత ఇండియన్ 2 షెడ్యూల్ స్టార్ట్ చేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular