Bigg Boss 6 Telugu- Inaya Sultana vs Srihan: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్ బాలలు మరియు బలహీనతలు అక్కడ ఉన్న తోటి ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా అర్థం అయ్యింది..అంతే కాకుండా కంటెస్టెంట్స్ గుణగణాల మీద కూడా ప్రతి ఒక్కరికి ఎదో ఒక అభిప్రాయం ఉంటుంది..కానీ మొదటి రోజు నుండి నేటి వరుకు హౌస్ లో ఎలాంటి ఒపీనియన్ కలిగించుకోలేకపోయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇనాయ సుల్తానా అని చెప్పొచ్చు..ఈమె ఏ వారం ఎవరితో స్నేహం చేస్తుందో..ఏ వారం ఎవరితో పోట్లాడుతుందో కలలో కూడా ఎవ్వరు ఊహించలేరు..రోజుకో రంగు మారుస్తూ ఊసరవెల్లి కంటే దారుణంగా ప్రవర్తిస్తుంది అంటూ ఇంటి సభ్యులతో పాటుగా ప్రేక్షకుల్లో కూడా కలిగిన భావన.

సూర్య విషయం లో కూడా ఆమె వేసిన స్ట్రాటజీలు ఎలాంటివో..రేవంత్ తో సూర్య గురించి ఆమె ఏమి మాట్లాడిందో ఈ షో ని చూసే ప్రతి ఒక్కరికి తెలుసు..తన గేమ్ ప్లాన్ ప్రేక్షకులకు కూడా అర్థం అయ్యిపోయింది కాబట్టి ఇప్పుడు ఎమోషనల్ డ్రామా చేస్తూ..శ్రీహాన్ మరియు శ్రీ సత్య మధ్య ఎఫైర్ నడుస్తున్నట్టు ప్రాజెక్ట్ చేస్తుంది.
ఈరోజు టాస్కు జరుగుతున్న సమయం లో శ్రీహాన్ మరియు ఇనాయ మధ్య జరుగుతున్న వాగ్వివాదం లో ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ ‘నామినేషన్స్ లో తప్ప కంటెంట్ ఇవ్వడం చేతకాని నువ్వు కూడా మాట్లాడుతున్నావ్’ అని శ్రీహాన్ అంటాడు..అప్పుడు ఇనాయ దానికి సమాధానం చెప్తూ ‘హా..నువ్వు ఎలాంటి కంటెంట్ ఇస్తున్నావో..ఎవరితో పడుకుంటున్నావో మేము కూడా ఈమధ్య చూస్తున్నాంలే’ అని ఒక దారుణమైన కామెంట్ విసురుతుంది.

దీనిపై శ్రీహాన్ టాస్కు ముగిసిన తర్వాత ఇనాయ దగ్గరకి వెళ్లి ‘ఆగు ఇనాయ..నీతో మాట్లాడాలి..ఇందాక ఏమిటి నోరు జారావ్..అది నోరా పెంటా..నోట్లో పెంట పెట్టుకొని మాట్లాడుతున్నావా..బుద్ది ఉందా నీకు..నేను నిన్ను అన్నాను కానీ ఎప్పుడైనా పర్సనల్ టార్గెట్ చేసానా..నువ్వు ఏమి వాగుతున్నావ్’ అంటూ గొడవకి దిగుతాడు..అలా ఇనాయ వేసిన ఆరోపణలను సమర్థవతంగా తిప్పి కొట్టేందుకు శ్రీహాన్ మరియు శ్రీసత్య చాలా వరుకు ఫైట్ చేసారు..మరి దీనిపై ఈ వీకెండ్ లో నాగార్జున గారు ఎలా స్పందిస్తారో చూడాలి.