Baladitya- Geetu: బిగ్ బాస్ సీజన్ 6 రోజులు గడిచేకొద్దీ టాస్కుల విషయం లో చాలా కఠినంగా మారిపోతుంది..సీజన్ ప్రారంభం లో ‘ఏంటి ఈ సీజన్ ఇంత బోర్ కొడుతోంది’ అని ప్రేక్షకులు అనుభూతి చెందిన విషయం వాస్తవమే..అందుకే ప్రారంభం లో టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఈ షో కి ముందు సీజన్స్ తో పోలిస్తే చాలా తక్కువ వచ్చాయి..ఇక ఆ తర్వాత వారాలు గడిచేకొద్దీ ఆసక్తికరమైన టాస్కులుతో పాటుగా హౌస్ లో మొదటి నుండి మంచి అనే మాస్కు వేసుకునేలా మాస్కులు కూడా తొలగిపోయాయి..వారిలో ముఖ్యంగా మనం బాలాదిత్య గురించి మాట్లాడుకోవాలి.

మొదటి నుండి ఈయన చెప్పే ప్రవచనాలు మరియు సూక్తులు వింటూనే ఉన్నాము..కానీ ఈ వారం ఈయన ఒక సిగరెట్ కోసం గీతూ తో చేసిన రచ్చ ఎవ్వరు మర్చిపోలేరు..మంచి నీళ్లు లేకపోయినా పర్వాలేదు, సిగరెట్ లేకపోతే సచ్చిపోతాను అనే రేంజ్ లో ఈయన ప్రవర్తించాడు..టాస్కులో భాగం గా బాలాదిత్య బలహీనత మీద గీతూ దెబ్బ కొట్టింది.
బాలాదిత్య సిగరెట్ మరియు లైటర్ ని దొంగలించి , అవి అడ్డం పెట్టుకొని అతని దగ్గరున్న లైఫ్ స్ట్రిప్స్ ని పొందాలని చూసింది..గేమ్ పరంగా చూస్తే అది స్ట్రాటజీనే అని అనుకోవాలి..బలహీనతకి లోనవకుండా ఆట ఆడేవాడే అసలైన ఆటగాడు..కానీ నిన్న బాలాదిత్య తన బలహీనతకు లోనయ్యాడు..గీతూ ని ఇష్టమొచ్చినట్టు తిట్టేసాడు..అతని గోల భరించలేక గీతూ సిగరెట్ మరియు లైటర్ తిరిగి ఇచ్చేస్తుంది.

ఇక ఆ తర్వాత ఆయన గీతూ దగ్గరకి వచ్చి ‘దయచేసి నన్ను క్షమించు అమ్మా..ఒక అమ్మాయిని అలాంటి మాటలు అనకూడదు..కానీ ఆ సమయం లో ఎమోషన్ లో వచ్చేసింది..ఒక చెల్లి మీద, ఒక తమ్ముడు మీద కోపం వచ్చినప్పుడు ఎలా అయితే తిడుతానో..అలానే నిన్ను తిట్టాను తప్ప నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు’ అంటూ చేతులెత్తి దండం పెట్టి క్షమాపణలు చెప్తాడు బాలాదిత్య..ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది..సిగరెట్ కోసం ఇంత రచ్చ ఎందుకు..పోతే పోయింది అనుకోవచ్చు కదా అని నెటిజెన్ల సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.