Inaya Sultana- Revanth: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే..ఈ టాస్కులో ఎవరు గెలుస్తారో..ఎవరు మొట్టమొదటి ఫైనలిస్ట్ అవుతారో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ టాస్కు వివిధ లెవెల్స్ లో చాలా ఆసక్తికరంగా సాగుతుంది..ఈ వారం మొత్తం జరగనున్న ఈ టాస్కులో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో వాళ్ళు బిగ్ బాస్ ఫైనల్స్ కి నేరుగా వెళ్ళిపోతారు..ఈ టాస్కులో ప్రస్తుతానికి ఆది రెడ్డి ఎక్కువ పాయింట్లు సాధించి నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు.

ఇక ఆయన తర్వాతి స్థానం లో రేవంత్, మూడవ స్థానం లో శ్రీహాన్ , నాల్గవ స్థానం లో ఫైమా , ఐదవ స్థానం లో కీర్తి మరియు చివరి స్థానం లో రోహిత్ కొనసాగుతున్నారు..ఇక ఈరోజు జరగబొయ్యే లెవెల్ టాస్కులలో ఎవరు ఎక్కువ పాయింట్స్ దక్కించుకొని లీడింగ్ లోకి వెళ్తారో చూడాలి..ఇక ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఫైర్ మరియు ఫన్ తో నిండిపోయిందని ప్రోమో చూస్తే అర్థం అయిపోతుంది.
ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమో లో రేవంత్ పాట పాడుతూ ఇనాయ ని వెక్కిరిస్తాడు..అప్పుడు ఇనాయ రేవంత్ ని తరుముకుంటుంది..రేవంత్ బాత్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంటాడు..అప్పుడు ఇనాయ ఆ బాత్ రూమ్ డోర్ కి లాక్ వేస్తుంది..అలా ఎపిసోడ్ ఫన్ తో సాగిపోతుంది అని అనుకునే లోపే బిగ్ బాస్ టికెట్ 2 ఫినాలే టాస్కు లో భాగంగా ‘గుడ్డు జాగ్రత్త’ అనే టాస్కుని నిర్వహిస్తాడు..ఈ టాస్కులో కంటెస్టెంట్స్ గుడ్డుని ఒక చిన్న కర్రపుల్ల తగిలించిన ప్లేట్ లో ఒక్క చేతితో పట్టుకొని జాగ్రత్తగా త్రేడ్స్ ని దాటుకుంటూ వెళ్ళాలి.

ఎవరైతే ఎక్కువసార్లు గుడ్డుని క్రిందపడేయకుండా వెళ్తారో వాళ్ళు టాస్కులో విజేతలుగా నిలుస్తారు..ఈ టాస్కు కి సంచాలకులుగా శ్రీ సత్య మరియు ఇనాయ వ్యవహరిస్తారు..ఈ టాస్కులో రేవంత్ ఓడిపోతాడు..అప్పుడు ఆయన శ్రీ సత్య తో గొడవకి దిగుతాడు..తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే ఈరోజు రాత్రి ప్రసారం అవ్వబొయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.