Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. అమ్మడు వయసు 35కి పైనే. అయితే పెళ్లి మాటెత్తడం లేదు. దానికి ఇంకా సమయం ఉందంటుంది. యాంకర్ గా బిజీగా ఉన్న రష్మీ ఆలోచన చేయడం లేదు. అయితే ప్రేమ పుకార్లు జోరుగా వినిపిస్తుంటాయి. రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేమికులుగా ప్రచారమయ్యారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. జబర్దస్త్, ఢీ షోస్ వేదికగా విచ్చలవిడిగా ప్రేమించుకుంటున్నారు. పలుమార్లు ఉత్తుత్తి పెళ్లి, శోభనం జరుపుకున్నారు.
అయితే ఇదంతా ఆన్ స్క్రీన్ వరకే… ఆఫ్ స్క్రీన్ లో మేము మిత్రులం మాత్రమే అంటారు. సుధీర్-రష్మీ గౌతమ్ ప్రేమ పుకార్లను పలుమార్లు ఖండించారు. అయితే జనాల్లో ఒక అనుమానం అయితే ఉంది. సుధీర్ మల్లెమాలను వీడినప్పటి నుండి రష్మీతో కనపించింది లేదు. రష్మీతో పాటు సుధీర్ కి కూడా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో ఏదో ఒక రోజు సడన్ గా బాంబు పేల్చుతారేమో అనే సందేహాలు ఉన్నాయి.
తాజాగా రష్మీ గౌతమ్ తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో జడ్జి ఇంద్రజ రష్మీని ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావని అడిగింది. నీకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాలని కోరింది. ఈ ప్రశ్నకు రష్మీ గౌతమ్ ఒకింత సిగ్గు పడింది. ‘వాడి మాటలు యాక్షన్ తో చూపించాలి, యాక్షన్ మాటలతో సింక్ అవ్వాలి అని చెప్పింది. దానికి హైపర్ ఆది ‘వాడు వేరే ఛానల్ లో ఉండాలి’ అని పంచ్ వేశాడు. ఇంకా మాట్లాడుతూ రష్మీ… చేసిందే చెప్పాలి. చెప్పిందే చేయాలి, అని చెప్పింది.
వాడు చేసినవన్నీ చెబితే చచ్చిపోతావ్ వద్దులే అని హైపర్ ఆది పంచ్ వేశాడు. రష్మీ చెప్పిన లక్షణాలను సుధీర్ కి అన్వయిస్తూ హైపర్ ఆది రష్మీ మీద పంచ్లు వేశారు. ఇక రష్మీ గౌతమ్ కాబోయేవాడి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వర్ష, సౌమ్యరావు సైతం తమకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పడం విశేషం. మరి రష్మీకి అలాంటి వాడు దొరుకుతాడో లేదో చూడాలి.
