Heroine Shobhana : ఒక సినిమా పూర్తి కావాలంటే లైట్ మెన్ నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది. ‘హీరోయిన్లుగా రాణించాలనుకునేవారికి అందం ఉంటే చాలు.. పెద్దగా శ్రమ ఉండదు’ అని అనుకుంటారు.. కానీ వారు పడే వేదన మామూలుగా ఉండదు. అయితే కొందరు తమ ఆవేదనను పట్టించుకోరు..మరికొందరు సందర్భం వచ్చినప్పుడు బయటపెడుతారు. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుకున్న విధంగా సీన్ రావాలంటే అతను చెప్పింది చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సాంగ్స్ లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేవిధంగా అందాలు ఆరబోయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని ఓ స్టార్ హీరోయిన్ కు డైరెక్టర్ చెప్పాడట. వర్షంలో పలుచటి చీరను కట్టుకోవాలని అన్నారట. దీంతో ఆ స్టార్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే నచ్చని ప్రేక్షకుడు ఉండడు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఆనందం. ఇప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదని ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్టార్ హీరో పక్కన నటించాలని ఒకప్పుడు ప్రతీ హీరోయిన్ ఆరాటపడేదట. ఈ సందర్భంలో స్టార్ హీరోయిన్ శోభనకు ఆ అవకాశం వచ్చింది. వీరిద్దరు కలిసి ‘శివ’ అనే తమిళ సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో ఓ వాన పాటను పెట్టారు. ఈ పాటలో శోభనను కాస్త రోమాంటిక్ గా కనిపించాలని డైరెక్టర్ చెప్పించాడట.
అందుకోసం పలుచటి చీర కట్టుకోవాలని చెప్పాడట. అయితే పలుచటి చీర మరీ ఇబ్బందిగా ఉంటుందని భావించి ఏదైనా కవర్ కట్టుకోవాలని అనకుందట శోభన. సమయం లేకపోవడంతో అక్కడున్న టేబుల్ కవర్ ను చుట్టుకుందట. ఈ పాటలో శోభను రెండు, మూడు డ్రెస్సులు మారుస్తుంది. ఓసారి డ్రెస్సులో కూడా కనిపిస్తుంది. ఈ డ్రెస్సులో టీవీ కవర్ ను చూడొచ్చు.. ఈ విషయాన్ని శోభన ఇన్నాళ్లకు బటయపెట్టింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో ఆసక్తి చర్చకు తెరలేపాయి.
సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో కష్టాలు ఉంటాయి..మరీ ముఖ్యంగా హీరోయిన్లు పడే బాధలు మాములువి కావని అనుకుంటున్నారు. హీరోయిన్ గా రాణించాలంటే అందం ఒక్కటే సరిపోదని, ఇలాంటి విషయాల్లో చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని చర్చించుకుంటున్నారు. అయితే ఇలాంటి విషయాన్ని శోభన బయటపెట్టారు. ఇంకా బయటపడని విషయాలు ఎన్ని ఉన్నాయో? అని అనుకుంటున్నారు.