Homeఎంటర్టైన్మెంట్Chatrapathi: బెల్లంకొండ ఛత్రపతి రీమేక్​లో బాలీవుడ్​ స్టార్​ కమెడియన్!​

Chatrapathi: బెల్లంకొండ ఛత్రపతి రీమేక్​లో బాలీవుడ్​ స్టార్​ కమెడియన్!​

Chatrapathi: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై యంగ్ ఎనర్జిటిక్​ హీరోగా పేరు తెచుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్​. అయితే, ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా హిట్​ కొట్టలేకపోయాయి. అయితే, ప్రస్తుతం బాలీవుడ్​లో తన లక్​ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు శ్రీనివాస్​. ఛత్రపతి రీమేక్​తో బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వివి వినాయక్​ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్​ చాలా ఫాస్ట్​గా సాగుతోంది. ఈ సినిమా తర్వాత స్టువర్టుపురం దొంగ సినిమాను పట్టాలెక్కించనున్నారు శ్రీనివాస్​.

in-bellam-konda-sai-srinivas-chatrapati-remake-movie-bollywood-star-actor-johny-liver-got-chance

కాగా, ఈ మూవీలో ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్​ ఛత్రపతి రీమేక్​లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో బెల్లం కొండ శ్రీనివాస్​ సోషల్​ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే జానీ లివర్​తో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ.. లెజండరీ యాక్టర్​ నాజీ లివర్​తో కలిసి స్క్రీన్​ షేర్​ చేసుకనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సెట్​లో జానీ లివర్​ ఉంటే..ఇక అందరూ ఎనర్జిటిక్​గా ఉంటారని శ్రీనివాస్​ పేర్కొన్నారు. అయితే, తెలుగు నేలపై పుట్టి ముంబయిలో స్థిరపడ్డ జానీ.. ఇప్పటికీ చక్కగా తెలుగు మాట్లాడగరు.

కాగా, జైజానకి నాయక, సీత సినిమాలు పెద్దగా హిట్​ సాధించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన రాక్షసుడు సినిమా ప్రేక్షకులను అలరించింది. క్రైమ్ థ్రిల్లర్​ నేపథ్యంలో సాగిన ఈ సినిమా అందరినీ కట్టిపడేసింది. ఇటీవలే వచ్చిన అల్లుడు అదుర్స్​ కూడా ఎప్పటిలాగే ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు బాలీవుడ్​లో అయినా విజయం సాధిస్తాడేమో వేచి చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular