https://oktelugu.com/

Ileana Baby Bump Photos: ఆయన ఎవరో తెలియదు, ఇలియానా మాత్రం డెలివరీకి సిద్ధమైంది… వైరల్ గా బేబీ బంప్ ఫోటోలు!

అభిమానుల అనుమానాలకు ఇలియానా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సస్పెన్సు అయితే కొనసాగుతుంది. తాజాగా బేబీ బంప్ రివీల్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది.

Written By:
  • Shiva
  • , Updated On : May 4, 2023 / 07:25 PM IST
    Follow us on

    Ileana Baby Bump Photos: హీరోయిన్ ఇలియానా త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఆమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలియానా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇలియానా ఏప్రిల్ 18న సంచలన ప్రకటన చేశారు. తాను గర్భవతిని అయ్యానంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు. త్వరలో నా చిన్నారిని కలబోతున్నానని ఒక కామెంట్ పెట్టి, ఈ విషయం తెలియజేశారు. ఇలియానా ప్రకటన అభిమానుల మైండ్ బ్లాక్ చేసింది. పెళ్లి కాకుండా తల్లి అవడమేంటీ? ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడమేంటని? వాపోయారు.

    అభిమానుల అనుమానాలకు ఇలియానా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సస్పెన్సు అయితే కొనసాగుతుంది. తాజాగా బేబీ బంప్ రివీల్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూస్తే ఆమెకు నెలలు దగ్గరపడ్డాయనిపిస్తుంది. ఈ క్రమంలో ఇలియానా ప్రెగ్నెన్సీ తెచ్చుకొని చాలా రోజులు అవుతుందన్న విషయం స్పష్టం అవుతుంది. మరో నెల లేదా రెండు నెలల్లో ఇలియానా గుడ్ న్యూస్ చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది.

    ప్రచారంలో ఉన్న వాదనల ప్రకారం ఇలియానా ప్రెగ్నెన్సీకి సెబాస్టియన్ మైఖేల్ కారణం అంటున్నారు. ఇతడు మోడల్. హీరోయిన్ కత్రినా కైఫ్ కి స్వయానా బ్రదర్. కొన్నాళ్లుగా సెబాస్టియన్-ఇలియానా డేటింగ్ చేస్తున్నారని, ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చారన్న ప్రచారం జరుగుతుంది. ఈ కథనాలపై ఇలియానా మౌనం వహించారు. ఆమె ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. అభిమానులు, సన్నిహితులు మాత్రం ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

    ఇలియానా కెరీర్ మొదలైంది టాలీవుడ్ లోనే. దర్శకుడు వైవీఎస్ చౌదరి ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. దేవదాసు మూవీలో రామ్ పోతినేనికి జంటగా ఇలియానా నటించారు. రెండో చిత్రమే మహేష్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేశారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ మూవీతో ఇలియానా స్టార్ హీరోయిన్ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్స్ పక్కన నటించారు. బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానా కెరీర్ నాశనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ చిన్నాచితకా చిత్రాల్లో నటిస్తోంది. చెప్పాలంటే హీరోయిన్ గా ఇలియానా కెరీర్ ముగిసినట్లే.