https://oktelugu.com/

Ileana D’Cruz : బ్రేకింగ్… పండంటి అబ్బాయికి జన్మనిచ్చిన ఇలియాన! పేరు ఏంటో తెలుసా?

సౌత్ లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న ఇలియానా రాంగ్ డెసిషన్ తీసుకుంది. బాలీవుడ్ వైపు వెళ్లి కెరీర్ నాశనం చేసుకుంది. బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన ఇలియానా సౌత్ లో కూడా ఫేమ్ కోల్పోయింది. కొన్నాళ్లుగా ఆమె అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. చెప్పాలంటే ఇలియానా కెరీర్ ఫేడ్ అవుట్ దశలో ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ లైఫ్ లో సెటిల్ అయ్యింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2023 / 10:09 AM IST
    Follow us on

    Ileana D’Cruz : హీరోయిన్ ఇలియానా మగ పిల్లాడిని కన్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పుట్టిన వెంటనే పేరు కూడా రివీల్ చేశారు. ఇలియానా కొడుకు పేరు చాలా భిన్నంగా ఉంది. ఇలియానా వివాహం చేసుకోలేదు. ఓ వ్యక్తితో ఆమె సహజీవనం చేశారు. ఇటీవల అతని ఫోటో ఇలియానా రివీల్ చేసింది. అతన్ని చూస్తే విదేశీయుడని తెలుస్తుంది. అతని కారణంగానే ఇలియానా గర్భవతి అయ్యారు. తాను తల్లి కాబోతున్నానని ప్రకటించిన ఇలియానా అందుకు కారణమైన వాడిని పరిచయం చేయకుండా సస్పెన్సు లో పెట్టింది.

    ఇఇ క్రమంలో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ తో సహజీవనం చేస్తున్న ఇలియానా తల్లి అయ్యారనే పుకార్లు లేచాయి. వీటి మీద ఇలియానా స్పందించలేదు. నెలలు నిండిన ఇలియానా ఆగస్టు 1న అబ్బాయికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కొంచెం ఆలస్యంగా తెలియజేసింది. ఒక తన కుమారుడు పేరు కోయ ఫీనిక్స్ డోలన్ అని పెట్టింది. కొడుకు ఫోటో కూడా రివీల్ చేసింది.

    దీంతో ఇలియానాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తాయి. అలాగే మీ అబ్బాయి క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలియానా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇలియానా దేవదాసు మూవీతో హీరోయిన్ అయ్యింది. రెండో చిత్రమే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మహేష్ కి జంటగా ఆమె నటించిన పోకిరి టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. దాంతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.