https://oktelugu.com/

Ileana D’Cruz : తల్లిని చేసిన అజ్ఞాతవ్యక్తిని పరిచయం చేసిన ఇలియానా… ఎవరే ఇతగాడు!

ఈ అజ్ఞాత వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ని ఘాడంగా ప్రేమించింది. కొన్నేళ్లు వారి ప్రేమాయణం సాగింది. 2019లో అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2023 / 07:25 PM IST
    Follow us on

    Ileana D’Cruz : హీరోయిన్ ఇలియానా గర్భవతి. ఇప్పుడు ఆమెకు తొమ్మిదో నెల. త్వరలో డెలివరీ కానుంది. కాగా ఇలియానాకు పెళ్లి కాలేదు. ఆమె సహజీవనం చేసి గర్భవతి అయ్యారు. కాగా అందుకు కారణమైన వ్యక్తిని ఇలియానా పరిచయం లేదు. అతన్ని అజ్ఞాతంలో ఉంచి ఫ్యాన్స్ ని సస్పెన్సులో పెట్టింది. ఎట్టకేలకు ఆ వ్యక్తి ఫోటో రివీల్ చేసింది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో తన బాయ్ ఫ్రెండ్ ఫోటో పోస్ట్ చేశారు. దీంతో నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది.

    కాగా హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ తో డేటింగ్ చేసిన ఇలియానా తల్లి అయ్యారనే పుకార్లు వినిపించాయి. గతంలో సెబాస్టియన్ తో ఇలియానా పలుమార్లు కనిపించారు. కత్రినా, సెబాస్టియన్, విక్కీ కౌశల్ ఫ్యామిలీ టూర్ లో ఇలియానా దర్శనమిచ్చింది. దాంతో సెబాస్టియన్-ఇలియానా దగ్గరయ్యారు. దాని ఫలితమే గర్భం అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఇలియానా పరిచయం చేసిన వ్యక్తి సెబాస్టియన్ కాదు.

    ఈ అజ్ఞాత వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ని ఘాడంగా ప్రేమించింది. కొన్నేళ్లు వారి ప్రేమాయణం సాగింది. 2019లో అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ కారణంగా ఇలియానా మానసిక వేదనకు గురయ్యారు. కొన్నాళ్ళు డిప్రెషన్ తో బాధపడ్డారు. ఆ సమయంలో ఇలియానా బరువు కూడా పెరిగింది. చికిత్స తీసుకున్న ఆమె మెల్లగా బయటపడ్డారు.

    ఇలియానా దేవదాసు మూవీతో చిత్ర పరిశ్రమలు పరిచయమైంది. రెండో చిత్రమే మహేష్ తో ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ దెబ్బతో స్టార్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్స్ సరసన నటించింది. ఇలియానా కుర్రాళ్ళ కలల రాణిగా మారారు. బాలీవుడ్ పై కన్నేసిన ఇలియానా కెరీర్ నాశనం చేసుకుంది. అక్కడ సక్సెస్ కాలేకపోయింది. సౌత్ ఆడియన్స్ మెల్లగా ఆమెను మర్చిపోయారు.