Manchu Vishnu Ginna Movie: ‘ మంచు విష్ణు హీరో గా నటించిన ‘జిన్నా’ సినిమా ఇటీవలే విడుదలై అప్పుడే థియేటర్స్ నుండి వెళ్ళిపొయ్యే స్థితిలో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..మంచు విష్ణు పాపం ఈ సినిమా కోసం చాలా బాగా ఖర్చుపెట్టాడు..పోనీ ఈ సినిమా సన్ ఆఫ్ ఇండియా లాగ నాసిరకం సినిమానా అంటే కాదు..కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకున్న చిత్రం ఇది..యూత్ ని మరియు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుట్ వంటి క్రేజీ హీరోయిన్స్ ని పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.

నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో కానేకం 50 లక్షలు కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించకపోవడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పొచ్చు..ఇక సోషల్ మీడియా లో మంచు కుటుంబం పై మేమెలు మరియు ట్రోల్ల్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరికి తెలిసిందే.
మంచు కుటుంబం ఇచ్చే బిల్డప్స్ కి నెటిజెన్ల ట్రోల్ల్స్ చెయ్యడం సర్వసాధారణం..అందుకే మంచు కుటుంబం పై సోషల్ మీడియా లో అంత నెగటివిటీ ఉంటుంది..అయితే తన మీద నెగటివిటీ ఆర్గానిక్ కాదని..ఒక ప్రముఖ హీరో 20 మంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ తో తనపై తన కుటుంబం పై ట్రోల్ల్స్ చేయిస్తూ ఉన్నాడని..అతను ఎవరో మీకు కూడా బాగా తెలుసు అంటూ మంచు విష్ణు జిన్నా మూవీ ప్రొమోషన్స్ లో చెప్పుకుంటూ వస్తున్నాడు..అంతే కాకుండా ఆ వెబ్ సైట్స్ పై మరియు యూట్యూబ్ చానెల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు.

దానితో పాటు సోషల్ మీడియా లో జిన్నా మూవీ పై పనిగట్టుకొని ట్రోల్ల్స్ వేసేవారిని కూడా వందలాది మంచు విష్ణు..వాళ్ళ పై కేసులు వేయించి అరెస్ట్ చేయిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు..ఇక నుండి జిన్నా సినిమా పై ట్రోల్ల్స్ వేసే ముందు ఆలోచించుకోండి..మంచు విష్ణు అన్న మాస్ వార్నింగ్ ఇచ్చేసాడు అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో సెటైర్లు వేస్తున్నారు.