https://oktelugu.com/

Game Changer : ఎదో అనుకుంటే..ఇంకేదో అయ్యింది..’గేమ్ చేంజర్’ మొదటిరోజు వసూళ్లు ఇంతేనా..? పాపం దిల్ రాజు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై పూర్తి స్థాయి డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 11, 2025 / 10:22 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై పూర్తి స్థాయి డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మూడేళ్ళ కష్టాన్ని డైరెక్టర్ శంకర్ వృధా చేసాడని, అసలు ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఈలలు వేసి చప్పట్లు కొట్టేలా లేదని, రామ్ చరణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు అద్భుతమైన నటనతో సినిమాని పైకి లేపేందుకు చాలా వరకు ప్రయత్నం చేసాడు కానీ, స్టోరీ లో కనీస స్థాయి దమ్ము కూడా లేకపోవడం వల్ల ఆయన కూడా కాపాడలేకపోయాడని అంటున్నారు. సినిమాని మరో లెవెల్ కి తీసుకొని వెళ్లగల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చాలా తక్కువ సమయంలోనే ముగించి సినిమాని పైకి వెళ్లకుండా ఉండేందుకు శంకర్ చాలా కృషి చేసాడని, ఇలా ఎన్నో రకాల కారణాలు నిన్న మనం సోషల్ మీడియా లో చూసాము.

    నెగటివ్ టాక్ అయితే చాలా బలంగా వచ్చింది, కనీసం ఓపెనింగ్ వసూళ్లు అయినా భారీ గా ఉంటాయేమో అని ఆశపడ్డారు. కానీ ఆ ఆశలమీద కూడా నీళ్లు చల్లింది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా కనీసం 120 కోట్ల రూపాయిల గ్రాస్ ని మొదటి రోజు ఈ చిత్రం రాబడుతుందని ఆశిస్తే, 90 కోట్ల రూపాయిల వద్ద ఆగిపోయిందని అంటున్నారు. రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్, శంకర్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తే ఏ రేంజ్ ఉండాలి?, ఊహించగలమా ఆ వసూళ్లను? కానీ మన ఊహల్లో పావు శాతం కూడా రాకపోవడం అభిమానులకు మింగుడు పడలేని విషయం. పాపం నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం డబ్బులు మంచి నీళ్లు లాగా ఖర్చు చేసాడు. కేవలం పాటలకే 75 కోట్లు ఖర్చు చేసాడు. ఆ డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరు లాగా తయారైంది.

    అసలే దిల్ రాజు చాలా కాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ ఉన్నాడు. ఈ సినిమా అయితే ఆయన పూర్తిగా కొంతకాలం అజ్ఞాతం లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. హిందీ వెర్షన్ ఓపెనింగ్ వసూళ్లు కాస్త ఊరట ని ఇచ్చాయి. అక్కడ ఈ చిత్రానికి మొదటి రోజు పది కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో కూడా మొదటి రోజు దాదాపుగా 30 వేల డాలర్లు వచ్చింది. ఈ చిత్రాన్ని కాపాడితే హిందీ వెర్షన్ వసూళ్లే కాపాడాలి. లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగకి ఎంత వస్తే అంత మహాప్రసాదం అనుకొని ఈ చిత్రాన్ని మర్చిపోవడమే. రామ్ చరణ్ కి మంచి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఈ చిత్రం ఫుల్ రన్ లో 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.