Sri Satya: శ్రీ సత్య.. వెండితెరపై నటిగా అడుగు పెట్టిన అచ్చమైన తెలుగు అమ్మాయి. సినిమాల్లో కెరీర్ ను స్టార్ట్ చేసినప్పటికీ బుల్లితెరపైనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. మోడల్ గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన శ్రీ సత్య అందాల పోటీల్లో పాల్గొనేవారు. ఈ విధంగానే మిస్ ఆంధ్రాగా నిలవడంతో పాటు కుర్రకారు మదిలో చెరగని ముద్ర వేసుకుంది.
మిస్ ఆంధ్రాగా విజయాన్ని వరించిన శ్రీసత్య ఏకంగా హీరో రామ్ పక్కన నటించే అవకాశాన్ని పొందారు. నేను శైలజ సినిమాలో రామ్ లవర్ గా చేశారు. ఆ తరువాత గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ వంటి సినిమాల్లో నటించారు. సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై అడుగు పెట్టిన శ్రీ సత్య అతి తక్కువ కాలంలోనే అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రీ సత్య జీ తెలుగు వేదికగా ముద్ద మందారం సీరియల్ తో అరంగేట్రం చేశారు. తరువాత నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని వంటి ప్రముఖ సీరియల్స్ లో నటించారు. దాంతో పాటు షార్ట్ ఫిల్మ్ లలో కూడా ప్రేక్షకులను కనువిందు చేశారు.
బుల్లితెర, వెండితెరపై రాణిస్తూ బాగా ఫేమస్ అయిన శ్రీ సత్య రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ -6 లో కంటెస్టెంట్ అవకాశాన్ని దక్కించుకున్నారు. సాదాసీదా అమ్మాయిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ అందంతో పాటు తనదైన ఆటతీరుతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. క్రేజ్ విపరీతంగా పెరగడంతో వరుస ఆఫర్లతో కెరీర్ లో దూసుకెళ్తున్న శ్రీ సత్య సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఫొటోస్, వీడియోస్ ను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా శ్రీ సత్య షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఎప్పుడూ సంప్రదాయబద్దంగా కనిపించే శ్రీ సత్య ఇటీవల గ్లామర్ డోస్ పెంచారని తెలుస్తోంది.