Nagarjuna BB6 Remuneration: తెలుగు బుల్లితెర పై సంచలనం సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పటికే 5 సీసన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీజన్లో లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..నిన్న 20 కంటెన్స్టెంట్స్ తో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో స్టార్ మా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది..మొదటి రోజు నుండే ఆసక్తికరమైన టాస్కులతో ఈరోజు నుండి ఈ రియాలిటీ షో ప్రతి రోజు రాత్రి పది గంటలకు ప్రసారం కానుంది..అంతే కాకుండా ఎన్నడూ లేని విధంగా ఈ రియాలిటీ షో డిస్నీ + హాట్ స్టార్ లో 24 / 7 లైవ్ స్ట్రీమింగ్ టెలికాస్ట్ కానుంది..టీవీ లో మనకి కేవలం ఒక గంట షో మాత్రమే టెలికాస్ట్ చేస్తారు..కానీ ఇక్కడ హౌస్ లో జరిగే 24 గంటల లైవ్ టెలికాస్ట్ ని ప్రసారం చేస్తారు..ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ రియాలిటీ షో కోసం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారిపోయింది.

బిగ్ బాస్ సీసన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సీసన్ 2 కి న్యాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక ఆ తర్వాత మూడవ సీసన్ నుండి ఆరవ సీసన్ వరుకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు..ఈ నాలుగు సీసన్స్ తో పాటుగా ప్రత్యేకంగా బిగ్ బాస్ OTT సీసన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించాడు..అంటే 5 సీసన్స్ కి హోస్ట్ గా పనిచేసాడు అన్నమాట..నాగార్జున పని చేసిన ప్రతి సీసన్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఇప్పుడు ఆరవ సీసన్ కి ఆయనకీ రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి స్టార్ మా ఛానల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

గడిచిన సీసన్స్ లో నాగార్జున కి ఒక్కో ఎపిసోడ్ కి గాను 40 లక్షల రూపాయిలు పారితోషికం ఇచ్చేవారట స్టార్ మా టీం..ఇక ప్రస్తుతం నడుస్తున్న ఆరవ సీసన్ కి గాను ఆయనకీ ఒక్కో ఎపిసోడ్ కి 55 లక్షల రూపాయిల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం..అంటే అన్ని ఎపిసోడ్స్ కి కలిపి ఆయనకీ 17 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ దక్కనుంది అన్నమాట..ఈ స్థాయి రెమ్యూనరేషన్ నాగార్జున కి హీరో గా చేసిన రాదు అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read:Renu Desai Second Marriage: రెండవ పెళ్లి పై రేణు దేశాయ్ సెన్సషనల్ కామెంట్స్..వైరల్ అవుతున్న పోస్ట్
[…] Also Read:Nagarjuna BB6 Remuneration: బిగ్ బాస్ సీజన్ 6 కోసం నాగార… […]