
Shruti Haasan: శ్రుతి హాసన్ సక్సెస్ మూడ్ లో ఉన్నారు. ఆమె కెరీర్ మళ్ళీ ట్రాక్ లో పడింది. ఆ మధ్య ప్రేమా దోమా అంటూ ప్రొఫెషన్ నాశనం చేసుకుంది. లండన్ ప్రియుడు మోజులో సినిమాలు పక్కన పెట్టేసింది. ఇంత త్యాగం చేస్తే మైఖేల్ కోర్సే ఆమెకు ఝలక్ ఇచ్చాడు. అనూహ్యంగా బ్రేకప్ చెప్పారు. కొన్నాళ్ళు శృతి డిప్రెషన్ తో బాధపడ్డారు. పనిలో పడితే వేదన నుండి బయటపడొచ్చని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ టైం లో శృతి హాసన్ ని టాలీవుడ్ అక్కున చేర్చుకుంది. దర్శక నిర్మాతలు వరుస ఆఫర్స్ ఇచ్చారు.
శృతి హాసన్ కమ్ బ్యాక్ చిత్రాలు క్రాక్, వకీల్ సాబ్ మంచి విజయాలు అందుకున్నాయి. ఇక సంక్రాంతి హీరోయిన్ గా రెండు సూపర్ హిట్స్ నమోదు చేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య పక్కన ఛాన్స్ ఇచ్చాడు. వీరసింహారెడ్డి మూవీలో పెద్దగా కంటెంట్ లేకపోయినా సంక్రాంతి పుణ్యమా అని బయటపడింది. బ్రేక్ ఈవెన్ దాడి హిట్ స్టేటస్ అందుకుంది.
ఇక వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య మూవీలో శృతి హాసన్ రా ఏజెంట్ పాత్రలో మెస్మరైజ్ చేసింది. సంక్రాంతి హీరోయిన్ గా రెండు సూపర్ హిట్స్ అందుకోవడం సాధారణ విషయం కాదు. శృతి హాసన్ ఈ అరుదైన ఫీట్ అందుకున్నారు.
ప్రస్తుతం శృతి చేతిలో సలార్ వంటి భారీ ప్రాజెక్ట్ ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. సలార్ మూవీతో ప్రభాస్ బాక్సాఫీస్ దుమ్ముదులపడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఈ చిత్ర విజయం శృతి హాసన్ కి మరింత బూస్ట్ ఇవ్వడం ఖాయం.
కాగా శృతి గ్లామర్, ఫిట్నెస్ కోసం ఎంత కష్టపడతారో తెలియజేస్తూ ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కిక్ బాక్సింగ్ చేస్తున్న శృతి వీడియో వైరల్ అవుతుంది. చాలా కాలం తర్వాత ప్రొఫెషనల్ ట్రైనర్ ఇర్ఫాన్ ఖాన్ పర్యవేక్షణలో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు శృతి కామెంట్ చేశారు. గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. నాజూకు శరీరం కోసం ఇలా కష్టపడక తప్పదు మరి.
View this post on Instagram