RGV and Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన దర్శకుడు ఆర్జీవి…ఆయన లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం…ఎప్పుడైతే శివ సినిమా వచ్చిందో అప్పటినుంచి సినిమా మేకింగ్ మొత్తం మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు చేసిన సినిమా వల్లే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలైతే క్రియేట్ అయ్యాయి. ఆయన ద్వారానే సినిమా మేకింగ్ లో చాలా మార్పులు వచ్చాయనేది వాస్తవం…ఇక దీనిని ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిందే. ఇక తన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన దర్శకులు చాలామంది ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం వర్మ ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చారని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఆయన చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో మేకింగ్ కి సంబంధించిన కొత్త ఒరవడిని సృష్టించాడు. ప్రస్తుతం అతని బాటలోనే చాలామంది నడుస్తుండడం విశేషం… ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ని మనం చూస్తూనే వస్తున్నాం… మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒక ఐడెంటిటి ఉంటుందనేది వాస్తవం…
ఇక రాజమౌళి లాంటి దర్శకుడు సైతం సందీప్ రెడ్డి వంగ గురించి చాలా గొప్పగా చెప్పిన సందర్భాలున్నాయి. ఇక ఆర్జీవి అయితే ఏకంగా సందీప్ రెడ్డి వంగని ఆకాశానికెత్తేశాడు…మొత్తానికైతే చాలా మంది దర్శకులు ఉన్నప్పటికి సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో కొత్తదనం ఉంది. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగ రామ్ గోపాల్ వర్మ ను టచ్ చేయడం కాదు ఆర్జీవీ కా బాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఒకప్పుడు వర్మ టాప్ డైరెక్టర్ గా కొనసాగాడు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఎప్పుడో అతన్ని మించిపోయాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…ఇక సందీప్ మాత్రం ఒకప్పటి వర్మ కంబ్యాక్ ఇస్తే మాలాంటి వాళ్ళ కెరియర్లు గల్లంతై పోతాయి అనే ధోరణిలో మాట్లాడుతుంటాడు.
ఇక సందీప్ నుంచి ఇప్పుడు స్పిరిట్ సినిమా రాబోతోంది. ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…