Pawan Kalyan: తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈయన క్రేజ్ తారాస్థాయిలో ఉంది అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇక రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన, టిడిపి, బిజెపి పార్టీ కూటమితో కలిసి పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఎలక్షన్స్ కి మూడు నెలల ముందు నుంచే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కోసం తన పూర్తి టైమ్ ను కేటాయించుకుంటూ వచ్చాడు. ఇక అందులో భాగంగానే మళ్లీ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొనబోతున్నాడు అనే విషయం మీదనే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అయితే జరుగుతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్ చేయడానికి అంత ఫిట్ గా అయితే లేడు. ఇక జూన్ 4వ తేదీన ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఒకవేళ కూటమికి అనుకూలంగా రిజల్ట్ వస్తే ఆయన మరికొన్ని రోజులపాటు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో ఎవరెవరి విధివిధానాలు ఏంటి అనేదాని మీద వీళ్లంతా డిస్కస్ చేసుకొని అంత ఏకపక్షం గా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు నడవడానికి అయితే సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొనడానికి ఎంత లేదన్న మరొక రెండు నెలల టైం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఫిజికల్ గా ఫిట్ అయిన తర్వాతనే సినిమా షూటింగ్ ల్లో పాల్గొనాలని చూస్తున్నాడు.
ఆయన రెస్ట్ లేకుండా ప్రచారంలో పాల్గొనడం వల్ల ఆయన గ్లామర్ అంత పోయింది. కాబట్టి హీరోగా మళ్లీ సందడి చేయాలంటే కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి జూలై 15 నుంచి గాని, లేదంటే ఆగస్టు నెల మొదటి వారం నుంచి గానీ తను షూటింగ్ ల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక తను మొదటగా ‘ఓజీ ‘ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ‘హరిహర వీరమల్లు’ సినిమాకి కొన్ని డేట్స్ ని ఇచ్చి మిగతాది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది…