NTR: ఎంజీఆర్ ఆ గొప్ప నటుడిని తొక్కేస్తే.. ఎన్టీఆర్ పైకి తీసుకొచ్చారు !

NTR: ‘సి.కె.నగేష్’ అనగానే సౌత్ సినీ తెర పై నవ్వులు పూస్తాయి. నిజానికి దక్షిణ భారతదేశంలో ఆయన లాంటి హాస్యనటుడు మరొకరు లేరు. పైగా ఆయన రంగస్థల నటుడు కూడా. నగేష్ నటించిన పలు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలు నేటికీ క్లాసిక్ చిత్రాలుగానే నిలిచిపోయాయి. అందుకే, ఆయనను దక్షిణాది చార్లీ చాప్లిన్ అని అభిమానులు ముద్దుగా అభివర్ణిస్తుండేవారు. నగేష్ అసలు పేరు ‘గుండూరావు’. 1933 సెప్టెంబర్ 27న కర్ణాటక రాష్ట్రం, తుముకూరు జిల్లాలోని చెయ్యూరులో ఒక […]

Written By: Shiva, Updated On : January 31, 2022 4:13 pm

NTR

Follow us on

NTR: ‘సి.కె.నగేష్’ అనగానే సౌత్ సినీ తెర పై నవ్వులు పూస్తాయి. నిజానికి దక్షిణ భారతదేశంలో ఆయన లాంటి హాస్యనటుడు మరొకరు లేరు. పైగా ఆయన రంగస్థల నటుడు కూడా. నగేష్ నటించిన పలు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలు నేటికీ క్లాసిక్ చిత్రాలుగానే నిలిచిపోయాయి. అందుకే, ఆయనను దక్షిణాది చార్లీ చాప్లిన్ అని అభిమానులు ముద్దుగా అభివర్ణిస్తుండేవారు. నగేష్ అసలు పేరు ‘గుండూరావు’.

NTR, MGR

1933 సెప్టెంబర్ 27న కర్ణాటక రాష్ట్రం, తుముకూరు జిల్లాలోని చెయ్యూరులో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో నగేష్ జన్మించారు. చిన్నప్పుడే సినిమాల పై పిచ్చితో మద్రాసుకు వచ్చేశాడు. ఆ తర్వాత కాలంలో భారతీయ రైల్వేలో ఉద్యోగం కూడా చేశాడు. నాటకాలపై మక్కువతో తొలుత రంగస్థల నటుడిగా అవతారమెత్తి.. అలా సినిమా నటుడిగా గొప్ప హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.

Also Read: ఇందుకే కాంగ్రెస్ ఓడేది.. రేవంత్ రెడ్డి మొర ఆలకించండ‌య్యా?

అయితే, నగేష్ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘సర్వర్ సుందరం’ 1964లో విడుదలైన ఈ సినిమాలో ఆయన నటన అపురూపం. ఇక తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల్ హాసన్ నటించిన దశావతారం. ఈ సినిమాలో ఆయన నవ్విస్తూనే ఏడిపించారు. ఐతే, నగేష్ జీవితంలో కూడా కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇగోలు ఎక్కువగా ఉంటాయి.

NAGESH

స్టార్స్ గా చలామణి అవుతున్న వాళ్ళ మాటను చిన్న నటీనటులు వినకపోతే ఇక వాళ్లకు లైఫ్ ఉండదు. ‘నగేష్’గారి జీవితంలో రుజువు అయిన సంఘటన ఇది. స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడంతో నగేష్ గారిలో ఒక తెలియని దైర్యం ఉండేది. ఆ దైర్యంతోనే ఓ సారి అప్పటి తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ సెట్ లోకి వచ్చినప్పుడు నగేష్ లేవలేదు. ఆ సంఘటనే నగేష్ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఎంజీఆర్ చెప్పడంతో అప్పట్లో నగేష్ కి ఎవ్వరూ అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు.

NAGESH

అందుకే, ఆ కాలంలో ఆయన ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ గారే నగేష్ కి తన చిత్రాల్లో అవకాశాలు ఇప్పించారు. ఎంజీఆర్ మాటను ఎదిరించే శక్తి ఆ రోజుల్లో ఎవరికీ లేకపోవడం వల్ల, ఎన్టీఆర్ గారే చొరవ తీసుకుని నగేష్ కి వరుసగా ఛాన్స్ లు ఇప్పించారు. ఈ విషయం ఎంజీఆర్ తెలిసినా ఆయన ఎన్టీఆర్ ను అడగలేదట. పైగా ఎన్టీఆర్ సపోర్ట్ నగేష్ కి ఉంది అని గ్రహించి.. అప్పటి నుంచి నగేష్ పై తన కోపాన్ని వదులుకున్నారు ఎంజీఆర్.

NAGESH

కారణం ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ అంటే.. ఎంతో అభిమానంగా ఉండేవారు. ఇక నగేష్ గారు ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘ఎంజీఆర్ ఈ చిన్న నటుడిని తొక్కేస్తే.. ఎన్టీఆర్ గారు పైకి తీసుకొచ్చారు’ అని ఎమోషనల్ అయ్యారు.

Also Read: బాలీవుడ్ : వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ !

Tags