https://oktelugu.com/

హిట్ అయితే జాత‌క‌మే మారిపోతుంది !

యాంకర్ ప్రదీప్ హీరోగా, అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా రానున్న సినిమా ‘౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా’. అయితే, ఇదివ‌ర‌కు కొంత‌మంది యాంక‌ర్లు హీరోలుగా అవ‌తారం ఎత్తారు. వాళ్లంద‌రికీ నెగిటీవ్ రిజ‌ల్టే వ‌చ్చింది. ప్ర‌దీప్‌.. తాజాగా ‘30 రోజుల్లో ప్రేమించడం సినిమాతో’ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఈ సినిమా గ‌నుక హిట్ట‌యితే.. ప్ర‌దీప్ జాత‌క‌మే పూర్తిగా మారిపోనుంది. ఇప్పటికే ప్రదీప్ మరో సినిమాని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. Also Read: భార్య పుట్టినరోజు […]

Written By:
  • admin
  • , Updated On : January 22, 2021 / 12:18 PM IST
    Follow us on


    యాంకర్ ప్రదీప్ హీరోగా, అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా రానున్న సినిమా ‘౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా’. అయితే, ఇదివ‌ర‌కు కొంత‌మంది యాంక‌ర్లు హీరోలుగా అవ‌తారం ఎత్తారు. వాళ్లంద‌రికీ నెగిటీవ్ రిజ‌ల్టే వ‌చ్చింది. ప్ర‌దీప్‌.. తాజాగా ‘30 రోజుల్లో ప్రేమించడం సినిమాతో’ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఈ సినిమా గ‌నుక హిట్ట‌యితే.. ప్ర‌దీప్ జాత‌క‌మే పూర్తిగా మారిపోనుంది. ఇప్పటికే ప్రదీప్ మరో సినిమాని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది.

    Also Read: భార్య పుట్టినరోజు జరిపేందుకు మహేష్ బాబు ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే?

    ఇక ఈ సినిమాలో రెండు రకాల పాత్రల్లో ప్రదీప్, లుక్స్ పరంగా కూడా వేరియేషన్స్ ను బాగా చూపించడం, ఎలాగూ పంచ్‌లు వేసి అలరించే అలవాటు ఉన్న ప్రదీప్, ఈ సినిమాలో కూడా తన శైలిని చూపించాడు. నూతన దర్శకుడు మున్నా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాలి. ఇక ఈ చిత్రంలోని పాట ‘నీలి నీలి ఆకాశం’ సెన్సేషనల్ హిట్టయి ఏకంగా వందల మిలియన్ల వ్యూస్ ను సాధించి మొత్తానికి రికార్డ్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

    Also Read: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా..?

    మరి జ‌న‌వ‌రి 29న ఈ సినిమా విడుద‌ల‌వుతోంది. ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎలాగైతే ఆక‌ట్టుకుందో, సినిమా కూడా ప్రేక్ష‌కుల్ని అలాగే అల‌రిస్తుంద‌ని నిర్మాత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్న నేపథ్యంలో.. మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి. క‌న్న‌డంలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా, కార్తీక్ శ్రీ‌నివాస్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్