Devara : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే వాళ్ళ అభిమానులు వాళ్ళను ఆరాధిస్తూ ఉంటారు… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు చాలా మంది పాన్ ఇండియా హీరోలుగా వెలుగుతుండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఇక ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా కూడా కొంతమంది సినిమా అభిమానుల వల్ల హీరోలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ విషయంలోనే అల్లు అర్జున్ మీద కేసు అవ్వడం ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ వెంటవెంటనే జరిగిపోయాయి. దాంతో ఈ రోజు ఆయన ఈరోజు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటినుంచి హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈవెంట్ మొత్తం అరెంజ్ చేసిన తర్వాత ఆ ఈవెంట్ ను క్యాన్సల్ చేశారు. లేకపోతే ఇలాగే తొక్కిసలాట జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ కూడా జైలుకు వెళ్లాల్సిన అవకాశం అయితే వచ్చేది. కాబట్టి ఆ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసి మంచి పని చేసారు అంటూ కొంతమంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ని ప్రశంసిస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం అంతటి జనానికి కూడా సెక్యూరిటీ ఇవ్వలేని గవర్నమెంట్ జనాన్ని ఏం కాపాడుతుంది అంటూ గవర్నమెంట్ మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఆ ఈవెంట్ జరిగితే అల్లు అర్జున్ పొజిషన్ లో ఎన్టీఆర్ ఉండాల్సి వచ్చేది.
కొంచెం ఎన్టీఆర్ తృటి లో తప్పించుకున్నాడు అల్లు అర్జున్ దొరికిపోయాడు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం కామెంట్లను చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక హీరోని హీరో లాగా అభిమానిస్తే తప్పులేదు కానీ అతని కోసం ఏవేవో చేసి వాళ్లకి ఇబ్బంది కలిగించే సంఘటనలను చేస్తేనే అభిమానుల మీద కూడా హీరోలకి కోపం వస్తుంది.
ఇక అభిమానుల ముసుగులో చాలామంది హీరోలకు బ్యాడ్ నేమ్ ని కూడా తీసుకువచ్చే వారు ఉన్నారు. కాబట్టి అభిమానులు హీరోలు ఎవరు ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో ఉంటే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగవు అంటూ చాలామంది ఈ విషయాన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారు…
ఇక ఏదేమైనా కూడా అల్లు అర్జున్ కేసు ఎక్కడిదాకా వెళ్తుందనే విషయం మీద ఇప్పటివరకు అయితే సరైన క్లారిటీ లేదు. మరి ఈ బెయిల్ ముగిసిన వెంటనే అల్లు అర్జున్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…