Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మంచి నటులు ఉంటారు.ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేసి మెప్పించగలిగెంత కెపాసిటీ కూడా వాళ్లకు ఉంటుంది. కానీ వాళ్లు కొన్ని పాత్రలను పోషించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. మరి కొంతమందికి మాత్రం కొన్ని పాత్రల్లో నటించాలని ఉన్నప్పటికీ వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు రావు. ఇక ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి కూడా ఇలానే తయారైంది.
ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా వైవిధ్యమైన పాత్రలను పోషించారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా ఒక సీరియస్ డాన్ పాత్ర ను మాత్రం ఇప్పటివరకు ఆయన పోషించలేదు. అలాంటి పాత్రలో చిరంజీవి నటిస్తే చూడాలని అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ తను ఇప్పటివరకు కూడా అలాంటి పాత్రను చేయలేదు. ఇక కారణం ఏంటి అంటే ఆయనకి అలాంటి పాత్రలు రాలేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఆ రకమైన పాత్రని కనక పోషించినట్లయితే, ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేయడం ఖాయం అంటూ చాలామంది అభిమానులు ఇప్పటికే పలు రకాలుగా స్పందిస్తున్నారు. చిరంజీవికి కనక ఒక భారీ డాన్ ఇమేజ్ ని క్రియేట్ చేసి దానికి తగ్గట్టుగా ఎలివేషన్స్ ఇచ్చినట్లయితే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఇక మలయాళం లో మమ్ముట్టి పోషించే పాత్రలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. నిజానికి ఆయన చేసిన భీష్మ పూర్వం సినిమాలో డాన్ గా కనిపించినప్పటికీ, ఫుల్ ఫ్లెడ్జ్ గా డాన్ కాదు కానీ అన్ని తన కంట్రోల్లోనే ఉంటాయి. కానీ తనెప్పుడు డాన్ గా ఫీల్ అవ్వడు, అలాంటి ఒక పాత్రలో ఇంటెన్స్ యాక్టింగ్ తో నటించి మెప్పించాడు.
చిరంజీవి కూడా అలాంటి పాత్రని చేస్తే చూడాలని ప్రతి ప్రేక్షకుడు కూడా కోరుకుంటున్నాడు. అయినప్పటికీ చిరంజీవి అలాంటి పాత్ర ను ఎప్పుడు పోషిస్తాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ మంచి దూకుడుని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే వశిష్ఠ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న చిరంజీవి ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అవుతున్నాడు…