Allu Arjun : ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్… ఈయన తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన మరోసారి పాన్ ఇండియాలో తన స్టామినా ఏంటో చూపించాడు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక దానికి సంబంధించి నాంపల్లి కోర్టు 14 రోజుల ఆయనకు రిమాండ్ విధిస్తే హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ కి ప్రముఖ హీరోలందరు కలిసి సంఘీభావం తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశాడు. స్వయంగా తనే తన కారును డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవి దగ్గరికి వెళ్లి తొక్కిసలాట లో జరిగిన సంఘటన గురించి తెలియజేస్తూనే తన అరెస్టు కు సంబంధించిన విషయాలను కూడా క్లారిటీగా తెలియజేశాడు.
ఇక ఏది ఏమైనా కూడా గత కొన్ని రోజుల నుంచి చిరంజీవికి అల్లు అర్జున్ కి మధ్య కొన్ని విభేదాలైతే ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ అల్లు అర్జున్ చిరంజీవిని కలవడం అనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. నిజానికి అల్లు అర్జున్ అరెస్టు అయిన వెంటనే చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన విషయం మనకు తెలిసిందే.
అయితే చిరంజీవి వచ్చినప్పుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర లేడు కాబట్టి ప్రత్యేకంగా తనే చిరంజీవిని కలవడానికి ఇప్పుడు తన ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక తనతో పాటు తన తండ్రి అయిన అల్లు అరవింద్ ఆవిడే సతీమణి, అల్లు అర్జున్ ఆయన సతీమణి, పిల్లలు అందరూ కలిసి చిరంజీవి ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంటూ రెండు సపరేట్ గా లేవని వీళ్లంతా ఒక్కటే అని మరోసారి ప్రూవ్ చేయడానికి అటు చిరంజీవి ప్రయత్నం చేస్తుంటే ఇటు అల్లు అర్జున్ కూడా దానికి సంఘీభావం తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది… మరి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఈ కేసు నుంచి ఎప్పుడు బయటపడతాడు అనే దాని మీదనే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…