నటీనటులు: సుశాంత్, మీనాక్షి చౌదరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి & ఇతరులు
దర్శకుడు: ఎస్ దర్శన్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక శాస్త్రి & హరీష్ కోయల గుండ్ల
సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: బృందా, రాజ్ కృష్ణ
ఎడిటర్: గ్యారీ బి హెచ్
సుశాంత్ (Sushanth), మీనాక్షి హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’(Ichata Vahanamulu Nilupa Radu). కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
అరుణ్ (సుశాంత్) ఆర్కిటెక్ట్ గా పనిచేస్తోన్న అఫీస్ లోనే అతని జూనియర్ గా జాయిన్ అవుతుంది మీనాక్షి (మీనాక్షి చౌదరి). వీరిద్దరి మధ్య సాగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఇద్దరు ప్రేమలో పడతారు. అయితే, మీనాక్షి ఇంటిలో ఎవరు లేరు అని తెలిసి ఆమె కోసం అరుణ్ మీనాక్షి ఇంటికి సీక్రెట్ గా వెళ్తాడు. కానీ అప్పటికే ఆ ఏరియాలో జరుగుతున్న పొలిటికల్ గొడవల్లో అరుణ్ ఇరుక్కుంటాడు. అతని పై ఓ మర్డర్ అటెంప్ట్ కేసు పడుతుంది ? మరి అరుణ్ ఆ కేసు నుండి ఎలా తప్పించుకున్నాడు ? చివరకు మీనాక్షి, అరుణ్ కలిశారా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
సుశాంత్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు. అదే విధంగా సెకండ్ హాఫ్ లో బైక్ తీసుకోని వెళ్లిపోయే సన్నివేశంలో తన హావభావాలతో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ఇక హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
హీరోయిన్ కి అన్నగా నటించిన అక్కినేని వెంకట్ కి నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. ఇతర కీలక పాత్రల్లో నటించిన వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం ఎప్పటిలాగే తమ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే, స్టోరీ పాయింటే చాలా వీక్ గా ఉంది.
స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునే విధంగా లేదు. ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నా దర్శకుడు సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు బాగాలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సెకెండ్ హాఫ్ యాక్షన్ డ్రామా,
హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ,
ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్.
మైనస్ పాయింట్స్ :
కథా కథనాలు,
ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాగదీత సీన్స్,
బోరింగ్ ట్రీట్మెంట్,
ఇంట్రస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్,
సినిమా చూడాలా ? వద్దా ?
‘లవ్ థ్రిల్లర్స్’ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇక మిగిలిన వర్గాల ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా ఆసక్తికరంగా ఈ సినిమా సాగలేదు.
రేటింగ్ : 2.5/5