Bigg Boss Keerthy : బుల్లితెర లో ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి పాపులారిటీ ని దక్కించుకున్న కీర్తి, ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది..తన కళ్ళ ముందే తల్లి , తండ్రి , చెల్లెలు ఇలా అందరూ రోడ్డు ప్రమాదం లో చనిపోయారు..ఆమె కూడా రోడ్డు యాక్సిడెంట్ కి గురైంది..చావు దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడింది..ఇది వింటుంటేనే మన మనసు ఎదోలాగా అయిపోతుంది.

ఇక అనుభవించిన కీర్తి కి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే..మనసులో ఇంత బాధ పెట్టుకొని కూడా గేమ్ ని అంత అద్భుతంగా ఆది సీజన్ 6 రెండవ రన్నర్ గా నిలవడం అంటే సాధారణమైన విషయం కాదు..ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఉన్న ఎన్నో వేలమందికి ఆమె ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు..అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కీర్తి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూస్ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది కీర్తి..ఆమె మాట్లాడుతూ ‘నేను అబ్బాయిని చాలా గాఢంగా పేమించాను..నాకు ఎలా అయితే తల్లిదండ్రులు లేరో..అతనికి కూడా ఎవ్వరూ లేరు..మేమిద్దరం పెళ్లి కూడా చేసుకున్నాం..కానీ చివరి నిమిషం లో అతను నా పవిత్రతని తప్పుబట్టాడు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో ఇక్కడ దాకా వచ్చావంటే ఎన్ని తప్పులు చేసి ఉంటావో..నువ్వు తప్పులు చెయ్యకుండా ఇండస్ట్రీ లో ఎదిగావంటే నేను అసలు నమ్మను అని అన్నాడు..ఆ మాటలు విన్న తర్వాత నా మనసు విరిగిపోయింది..బ్రేకప్ చెప్పి చాలా రోజులు బాధపడ్డాను..ఎందుకులే ఇప్పుడు వాటి గురించి తల్చుకుంటే మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటాను..ఇప్పుడు నేను సంతోషం గా ఉన్నాను..నా గతాన్ని గుర్తు చేసుకోదల్చుకోలేదు’ అని కీర్తి చాలా ఎమోషనల్ గా చెప్తుంది..ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.