Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga: ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా టైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. యూట్యూబ్లో ఈ సినిమా సాంగ్స్ మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు అలరించడానికి రానుంది. దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2 సినిమా తర్వాత ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య కు జోడిగా ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ హైదరాబాదులో ఆదివారం నిర్వహించింది. ఇక ఈ వేడుకకు యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో మాట్లాడి న ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు ముందు సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నామని తెలిపారు. ఈయన మాట్లాడుతూ తండేల్ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఏది చూసినా కూడా ఎమోషన్ కనిపిస్తుంది. నాగచైతన్య, సాయి పల్లవి తమ పాత్రలలో ఒదిగిపోయారు. కేడి చిత్రానికి నేను పనిచేస్తున్న సమయంలో నాగచైతన్య ను చూశాను. చైతు డ్రెస్సింగ్ స్టైల్, కార్ డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం. కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చేసేటప్పుడు డిజైనర్ కు నాగచైతన్య కాస్ట్యూమ్స్ నో రిఫరెన్స్ గా చూపించే వాడిని అంటూ చెప్పుకొచ్చారు.
ప్రేమమ్ సినిమా నుంచి నేను హీరోయిన్ సాయి పల్లవి కి అభిమానిగా మారిపోయాను. నేను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమాకు ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నాను. ఈ క్రమంలో ఒక కోఆర్డినేటర్ను కూడా సంప్రదించాను. మీ సినిమాలో రొమాంటిక్ స్టోరీ ఎక్కడుంది.. ఆ విషయం మర్చిపోండి సార్.ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేయదు అని చెప్పాడు. వరుసగా అవకాశాలు వస్తుంటే హీరోయిన్స్ కూడా మారిపోతారు అనుకున్నాను. కానీ సాయి పల్లవి మాత్రం ఏం మారలేదు. చందు నాకు పరిచయం. అక్కినేని అభిమానులకు ఈ సినిమా పండగే.
నేను గతంలో మజిలీ మూవీ ఈవెంట్ కు వచ్చాను. అది హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే అని సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి గురించి సందీప్ రెడ్డి వంగ మాట్లాడిన మాటలు విని అభిమానులు ఆనందిస్తున్నారు.