Naga Chaitanya: అక్కినేని ఫామిలీ మూడవ తరం నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగ చైతన్య అతి తక్కువ సమయం లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఎలాంటి వివాదాల్లోకి తలదూర్చకుండా చాలా కూల్ గా ఉండే స్వభావం గలవాడు నాగ చైతన్య..అందుకే ఆయనని ప్రతి ఒక్కరు అభిమానిస్తూ ఉంటారు..ఇక సమంత తో విడాకులు అయినా తర్వాత నుండి నాగ చైతన్య ఎక్కువగా రూమర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడం విశేషం..ప్రస్తుతం ఇప్పుడు ప్రతిరోజు ఎదో ఒక రూమర్ తన గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది..మొన్నీమధ్యనే ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో డేటింగ్ లో ఉన్నాడు , త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అని ఒక రూమర్ సోషల్ మీడియా నుండి నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా వరుకు ప్రచారం సాగిన సంగతి మన అందరికి తెలిసిందే..దీనిపై నాగ చైతన్య ఎలాంటి స్పందన చెయ్యకపోయినా , శోభిత దూళిపాళ్ల మాత్రం మిడిల్ ఫింగర్ చూపుతూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారికి పరోక్షంగా సమాధానం చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా తో కూడా డేటింగ్ చేస్తునట్టు వార్తలు వచ్చాయి..ఇటీవల థాంక్యూ మూవీ ప్రొమోషన్స్ కోసం ఇద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ యాంకర్ ప్రస్తావనకు తీసుకొని రాగా, అవి కేవలం రూమర్స్ మాత్రమే అని, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చారు..అయితే తమ మధ్య వ్యక్తిగత విషయాలను పంచుకునే రేంజ్ సాన్నిహిత్యం ఉందని నాగ చైతన్య తెలిపాడు..నా జీవితం లో చోటు చేసుకునే ప్రతి విషయాన్నీ తనతో పంచుకుంటానని..అలాంటి స్నేహితులు ఇండస్ట్రీ లో నాకు చాలా తక్కువ అని..వారిలో రాశి ఖన్నా కూడా ఒకరు అని నాగ చైతన్య వ్యాఖ్యానించారు.
Also Read: Pawan Kalyan Chaturmasya Deeksha: పవన్ కళ్యాన్ చాతుర్మాస్య దీక్ష.. అసలేంటిది? ఎందుకు చేస్తారు?

ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..వీళ్లిద్దరు కలిసి నటించిన థాంక్యూ అనే సినిమా ఈ నెల 22 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దీనితో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు ఈ జంట..మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది ఈ ట్రైలర్..మరి సినిమా కూడా అదే రేంజ్ లో అలరిస్తుంది లేదా అనేది తెలియాలంటే జులై 22 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.
Also Read:Poison Experiment On Star Comedian: స్టార్ కమెడియన్ పై విష ప్రయోగం..ఇప్పుడు ఆయన ఏ స్టేజి లో ఉన్నడో తెలుసా?
Recommended Videos
[…] […]
[…] […]