Naga Chaitanya : సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో వీళ్లిద్దరి పెళ్లి అయ్యింది. అప్పుడే వీళ్ళ పెళ్లి జరిగి రెండు నెలలు పూర్తి అయ్యిందా అని అనిపిస్తుంది కదూ..ఇద్దరు కొత్త ఇంట్లోకి కూడా ప్రవేశించారు. వీళ్లిద్దరి పెళ్లి తర్వాత విడుదల అవుతున్న సినిమా ‘తండేల్’. ఈ నెల 7వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేసారు. ప్రొమోషన్స్ కూడా దుమ్ము లేపేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తమిళం, హిందీ భాషల్లో కూడా నాన్ స్టాప్ ప్రొమోషన్స్ చేస్తున్నారు.
ప్రొమోషన్స్ లో భాగంగా, నాగచైతన్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన భార్య శోభిత దూళిపాళ్ల గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సాధ్యమైనంత వరకు నేను చాలా ప్రశాంతంగానే ఉంటాను. కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నా నేను కూడా మనిషినే కదా. అప్పుడప్పుడు నా మీద ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ ప్రభావం వల్ల నేను గందరగోళంకి గురి అవుతూ ఉంటాను. ఆ సమయంలో నా ఆలోచనను వెంటనే శోభిత తో పంచుకుంటాను. ఎప్పుడైనా నేను ఒత్తిడిలో ఉన్నానంటే శోభిత దానిని పసిగట్టి ఏమైంది అని అడుగుతుంది. ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా, చాలా చక్కగా ఆలోచిస్తుంది. అందుకే ఆమె ఇచ్చే సలహాలను గౌరవించి నేను తీసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. తన భార్య గురించి ఇంత మంచిగా మాట్లాడడంతో సోషల్ మీడియా లో నాగచైతన్య పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో జరిపించాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా చేసారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేసారు. కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు అనేది చూడాలి. రేపు లేదా ఫిబ్రవరి నాల్గవ తేదీన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపే ఆలోచనలో ఉన్నారు. ‘తండేల్’ చిత్రానికి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. పాటలు,ట్రైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు కానున్నాయి.