Kamal Haasan: కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..విశ్వరూపం 2 తర్వాత కమల్ హాసన్ నుండి విడుదలైన సినిమా ఇదే..విశ్వరూపం సినిమా అప్పట్లో ఎన్ని అడ్డంకుల మధ్య విడుదల అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మొదటి రోజు ఈ సినిమాని తమిళనాడు లో విడుదల చేయించలేదు అప్పటి ప్రభుత్వం..తనకి జరుగుతున్న అన్యాయం గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నాడు..ఈ వీడియో అప్పట్లో అభిమానుల మనసుని కలిచివేసింది..దేశం గర్వించదగ్గ నటుడు ఇలా కంటతడి పెట్టడం అందరికి అప్పట్లో చాలా బాధవేసింది..విన్నూతనమైన కథాంశం తో కమల్ హాసన్ చేసిన ఈ చిత్రం అన్ని అద్దనుకులను దాటుకొని సూపర్ హిట్ గా నిలిచింది..ఇక ఆ తర్వాత కమల్ హాసన్ దీనికి సీక్వెల్ గా ‘ విశ్వరూపం 2 ‘ తీసాడు..ఈ సినిమాకి కూడా ఆయన దర్శకత్వం వహిస్తూ నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు..తన దగ్గర ఈ సినిమాని తియ్యడానికి బడ్జెట్ సరిపోకపోతే తన ఆస్తులను మొత్తం తాకట్టు పెట్టి సినిమా తీసాడు..కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..కమల్ హాసన్ ఈ సినిమా దెబ్బకి చాలా తీవ్రంగా అప్పులపాలై ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకున్నాడు.
Also Read: Chiranjeevi Vs Ballaya: దసరా కి చిరు vs బాలయ్య.. ఎవరు గెలుస్తారో చూడాలి
అదే సమయం లో గత ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి ఎదురు అవ్వడం తో కమల్ హాసన్ మానసికంగా మరింత కృంగిపోయాడు..కానీ మనసు నిండా ఆత్మధైర్యం ని కూడగట్టుకొని విక్రమ్ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థలో తీసాడు..ఇక ఆ తర్వాత హిస్టరీ ఏమిటో మన అందరం ఇప్పుడు చూస్తున్నాము..ఈ సినిమా సక్సెస్ పై కమల్ హాసన్ ఇటీవల జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపు లో మాట్లాడుతూ ‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ప్రత్యర్థులు నా అపజయాన్ని చూసి బాగా నవ్వుకున్నారు..అతి త్వరలోనే నేను 300 కోట్ల రూపాయిలు సంపాదించి మీసం మెలివేస్తాను అని చెప్పను..నాకు మతి స్థిమితం తప్పిందేమో అని అనుకున్నారు..కానీ నేను ఇలా విక్రమ్ సినిమా ద్వారా 300 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొడుతాను అని వాళ్ళు గ్రహించలేకపొయ్యారు..ఇప్పుడు నాకొచ్చిన డబ్బులతో లోన్స్ అన్ని కట్టుకుంటాను..నచ్చిన తిండి కడుపునిండా తింటాను..నా తోటి వారు కష్టం లో ఉంటే నా దగ్గర ఉన్న డబ్బులు అయ్యేంత వరుకు సహాయపడుతాను..డబ్బులు అయిపోయిన తర్వాత నా దగ్గర ఇక డబ్బులు లేవు అని చెప్తాను..డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి సహాయం చేసేంత గొప్ప మనిషిని అవ్వాలనుకోవడం లేదు..కేవలం ఒక మనిషి గా మాత్రమే జీవించాలి అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు కమల్ హాసన్..ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Also Read: Nandigama: తోబుట్టువుకు న్యాయం కోసం హస్తినా బాట.. ఈసారి ఏకంగా రిక్షాపై…