Salaar: పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాపిక్ ను సంపాదించుకొని సూపర్ హిట్ అయ్యో దిశగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని చూసిన చాలా మంది అభిమానులు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి భారీ హిట్ అయితే పడడం లేదు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ కి భారీ హిట్ పడింది అంటూ వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాతో మరోసారి తనని తన ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల పైన కలక్షన్స్ ను రాబడుతుంది అంటూ మరి కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదిక రచ్చ రచ్చ చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే సలార్ సినిమాను చూసిన మరి కొంతమంది మాత్రం ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఇవ్వడంలో తోపు డైరెక్టర్ అని అందరికీ తెలుసు కానీ కొన్ని ఎలివేషన్స్ మాత్రం అనవసరంగా ఇచ్చినట్టుగా అనిపించింది. అంటూ సలార్ సినిమా మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
అవి ఏంటి అంటే ఒక రాడ్ మీద ప్రభాస్ చేయి వేసినపుడు దాని మీద అతని ఫింగర్ ప్రింట్స్ అచ్చు పడడం అనేది, అలాగే ప్రభాస్ ఒక గుద్దు గుద్దుగానే కరెంట్ షాక్ కొట్టిన వాడు బతికి రావడం అనేది సినిమాకి పంటి కింద రాయిలా అనిపించిందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఎందుకంటే ఇలాంటి అనవసరపు ఎలివేషన్ సీన్స్ పెట్టడం వల్లే సినిమా అంత ఒక ఫ్లో లో వెళ్ళేది మధ్యలో ఇలాంటి వాటి వల్ల సినిమా చూసే మూడ్ కొంచెం డిస్టర్బ్ చేసినట్టు గా అవుతుంది అంటూ మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా ఇప్పటికీ ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా సూపర్ గా ఉంది అంటూ కామెంట్లు చేయడంతో ఈ సినిమాకి భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక దాంతో ప్రభాస్ మరోసారి ఈ సినిమాతో తన సత్తా చాటుతూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఈ వీకెండ్స్ లోనే ఈ సినిమా భారీ కలక్షన్స్ ని రాబడుతూ ముందుకు దూసుకెళుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…