Kirthy Suresh: హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ ఇంతకు తెగిస్తుందని అసలు ఊహించలేదు. ఒంటిపై ఉందా లేదా అన్నట్లున్న డ్రెస్ లో ఈ రేంజ్ స్కిన్ షో చేస్తుందనుకోలేదు. గ్లామరస్ హీరోయిన్స్ కన్నుకుట్టేలా, వాళ్ళు కుళ్ళుకునేలా టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సెగలు పుట్టించింది. కీర్తి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది.

ఒకప్పుడు బొద్దుగా ఉండే కీర్తి చాలా సన్నబడ్డారు. కష్టపడి సాధించిన నాజూకు అందాలను దాచుకోకుండా చూపిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే కీర్తి ఏదో కొత్త ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారనిపిస్తుంది. హోమ్లీ హీరోయిన్ అనే బ్రాండ్ నేమ్ తనకు నచ్చడం లేదనుకుంటా. ఆమె లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాటలో కూడా ఓ డిఫరెంట్ రోల్ ట్రై చేసింది. ఆ సినిమాలో కీర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడం విశేషం.

మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సర్కారు వారి పాట కమర్షియల్ గా పర్వాలేదు అనిపించుకుంది. బ్రేక్ ఈవెన్ దాటి స్వల్ప లాభాలు పంచింది. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న కీర్తి సర్కారు వారి పాట చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే మహానటి రేంజ్ హిట్ ఆమెకు మరలా తగల్లేదు. మహానటితో వచ్చిన ఇమేజ్ తో కీర్తి వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయగా నిరాశపరిచాయి.

ఓటీటీలో విడుదలైన చిన్ని మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన క్రైమ్ అండ్ రివేంజ్ డ్రామా చిన్ని లో కీర్తి నటన అద్భుతం. డీ గ్లామర్ రోల్ లో సీరియల్ కిల్లర్ గా కీర్తి సహజ నటనతో మెప్పించింది. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక రోల్ చేశారు.

ప్రస్తుతం కీర్తి తెలుగులో దసరా, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. నాని హీరోగా దసరా తెరకెక్కుతుంది. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భోళా శంకర్ తెరకెక్కుతుంది. ఈ మూవీలో కీర్తి చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. వీటితో పాటు మామన్నన్ అనే తమిళ చిత్రం చేస్తున్నారు. తెలుగులో కీర్తి కెరీర్ ని దసరా నిర్ణయించనుంది. ఆ మూవీ ప్లాప్ అయితే ఇక కష్టమే.
