Tabu Sensational Comments: స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో హైట్స్ చూసిన టబు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఆమె వయసు అర్థ సెంచరీ దాటేయగా, ఇక పెళ్ళి చేసుకోవడం కష్టమేనని అందరి అభిప్రాయం. నటిగా మూడు దశాబ్దాల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఆమె సింగిల్ గా ఎందుకు ఉంటున్నారనేది అంతు చిక్కని విషయం. ఐతే తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, పిల్లలు వంటి వ్యక్తిగత విషయాలపై టబు నోరు విప్పారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

జీవితంలో ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలి అనుకుంటారు. మీరు మాత్రం ఇంకా సింగిల్ గానే ఉండిపోయారని అడగ్గా… పిల్లల్ని కనాలంటే పెళ్లే చేసుకోవాలా? పెళ్లి చేసుకోకుండా కూడా పిల్లల్ని కనొచ్చు, అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. నాకు నచ్చినవాడు ఇంకా దొరకలేదు. మహిళల్ని అన్ని విధాలుగా గౌరవించేవాడు, మనసుకు దగ్గరైనవాడు దొరికినప్పుడు కచ్చితంగా వివాహం చేసుకుంటాను, అన్నారు. వయసు పైబడుతున్న క్రమంలో ఇవన్నీ సాధ్యమేనా అని అడగ్గా… ఈ రోజుల్లో వయసు దేనికీ అడ్డు కాదు. ఏ వయసులో అయినా నచ్చిన పని చేయవచ్చని సమాధానం చెప్పారు.
అయినా ఒక మహిళ పెళ్లి చేసుకోనంత మాత్రాన, తల్లి కానంత మాత్రాన చచ్చిపోదు. దాని వలన వచ్చిన నష్టమేమీ లేదని కుండబద్దలు కొట్టింది. ఒక సీనియర్ హీరోయిన్ అయ్యుండి ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనం రేపుతోంది. కాగా టబు కెరీర్ లో ఒకరిద్దరు హీరోలతో స్ట్రాంగ్ రిలేషన్ నడిపినట్లు పుకార్లు ఉన్నాయి. కింగ్ నాగార్జునకు ఆమెకు మధ్య సంథింగ్ సంథింగ్ అంటారు. అయితే చాలా సందర్భాల్లో నాగార్జున ఈ వ్యాఖ్యలు ఖండించారు. తన భార్య అమలకు కూడా టబు మంచి ఫ్రెండ్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇక బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ తో ఆమె సీరియస్ రిలేషన్షిప్ నడిపినట్లు సమాచారం. ఆయనతో పెళ్లి వరకు వ్యవహారం వెళ్లిందట. కారణం ఏదైనా అది జరగలేదు. టబు సింగిల్ గా మిగిలిపోవడానికి అజయ్ దేవ్ గణ్ కారణం అంటారు. ఏది ఏమైనా 51 ఏళ్ల టబు ఇంకా నచ్చిన వాడు దొరకలేదు, దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పడం విడ్డూరం. పుణ్య కాలం మొత్తం గడిచిపోయాక చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే ఏంటి…