Renu Desai: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ‘రేణు దేశాయ్’ ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవారు. అయితే, గత కొంతకాలంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ కి దూరం అయిపోయారు. నిత్యం తనదైన పోస్ట్ లతో అలరించే ఆమె ఉన్నట్టు ఉండి సైలెంట్ అయిపోవడంతో గాసిప్ రాయుళ్లు అనేక పుకార్లకు నాంది పలికారు. రేణు దేశాయ్ కు హెల్త్ బాలేదని ఓ రూమర్ ను సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు.

అయితే, తన ఆరోగ్యం పై వస్తున్న కథనాల పై తాజాగా ఆమె స్పందిస్తూ.. “నేను ఇన్ స్టాగ్రామ్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్న మాట నిజమే. అయితే, గ్యాప్ కి కారణం నా అనారోగ్యం కాదు. నేను బాగున్నాను, నాకు ఏమీ కాలేదు. నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాను. నా క్షేమ సమాచారం గురించి, ఆ ఆరోగ్యం గురించి ఆందోళన పడిన వారికీ, నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిన అందరికీ థాంక్స్’ అంటూ ఒక మెసేజ్ పెట్టారు.
మెసేజ్ తో పాటు పనిలో పనిగా తన కొత్త ఫోటోలను కూడా రేణు పోస్ట్ చేశారు. ప్రస్తుతం రేణు తన కుమారుడు అకీరా, కూతురు ఆద్యతో హైదరాబాద్ లో ఉంటున్నారు. గతంలో రేణు కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేయడం, అలాగే పవన్ పై కూడా కాస్త నెగిటివ్ టచ్ ఇచ్చే కామెంట్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆమెతో సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగేవారు.
అయితే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు ‘రేణు దేశాయ్’తో గొడవ పడటం తగ్గించారు. తనకు ఆ గోల తగ్గింది అని ఆమె కూడా ప్రస్తుతం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ పై ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ అభిమానం చూపిస్తూ ఉంటారు. పవన్ తో ఆమె బంధం తెగి పోయినప్పటికీ ఆమెను వాళ్ళు తమ వదినగానే భావిస్తారు.
Also Read: Vikram movie: విక్రమ్ సినిమా షూటింగ్ షురూ.. కమల్‌తో పాటు బరిలోకి ఆ ఇద్దరు హీరోలు!
అన్నట్టు రేణు దేశాయ్ ప్రస్తుతం ఓ పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సెకెండ్ ఇన్నింగ్స్ ను ఆమె గ్రాండ్ గా ప్రారంభిస్తోంది. మరి రేణు దేశాయ్ తన రీ ఎంట్రీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే ఆమె చేస్తోంది పాన్ ఇండియా సినిమా కదా.
Also Read: Bigg Boss 5 Telugu: పండంటి బిడ్డకి జన్మనిచ్చిన నటరాజ్ మాస్టర్ భార్య