https://oktelugu.com/

క్షమాపణ చెప్పిన జబర్ధస్త్ హైపర్ ఆది

తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను అవమానించేలా మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న హైపర్ ఆది తాజాగా ఓ టీవీ చానెల్ లైవ్ లో భేషరతుగా క్షమాపణ చెప్పారు. తాను ఓ కార్యక్రమంలో కించపరిచేలా మాట్లాడాడని తాజాగా తెలంగాణ జాగృతి నాయకులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైపర్ ఆదిని హైదరాబాద్ లో తిరగనివ్వమని.. సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈవివాదంపై హైపర్ ఆది స్పందించాడు. తన వైపు నుంచి తప్పు జరిగి ఉంటే భేషరతుగా క్షమాపణ చెబుతానని […]

Written By:
  • NARESH
  • , Updated On : June 15, 2021 / 05:39 PM IST
    Follow us on

    తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను అవమానించేలా మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న హైపర్ ఆది తాజాగా ఓ టీవీ చానెల్ లైవ్ లో భేషరతుగా క్షమాపణ చెప్పారు. తాను ఓ కార్యక్రమంలో కించపరిచేలా మాట్లాడాడని తాజాగా తెలంగాణ జాగృతి నాయకులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైపర్ ఆదిని హైదరాబాద్ లో తిరగనివ్వమని.. సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.

    ఈ క్రమంలోనే ఈవివాదంపై హైపర్ ఆది స్పందించాడు. తన వైపు నుంచి తప్పు జరిగి ఉంటే భేషరతుగా క్షమాపణ చెబుతానని ప్రకటించాడు. జాగృతి నాయకులు మీడియా సాక్షిగా హైపర్ ఆదికి ఫోన్ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో న్యాయపరంగా కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

    దీనికి హైపర్ ఆది స్పందించారు. తాను కేవలం నటుడిని మాత్రమేనని.. స్క్రిప్ట్ తాను రాయలేదని చెప్పుకొచ్చాడు. ఆ కార్యక్రమం స్టేజీ మీద 20మంది ఆర్టిస్టులు ఉన్నారని.. ఎవరి పాట వారు పాడుకుంటున్నారని.. స్టేజీ మీద బతుకమ్మపై ఎవరంటున్నారో తనకు తెలియదన్నారు.

    ఒకవేళ తాను అన్నదాంట్లో నిజంగా తప్పుంటే క్షమించాలని అడిగేందుకు ఎలాంటి సమస్య లేదని హైపర్ ఆది తెలిపాడు. ఆ ఫ్లోలో ఏదైనా తప్పుగా మాట్లాడితే తెలంగాణ వాళ్లకు భేషరతుగా క్షమాపణ చెబుతానని హైపర్ ఆది వెల్లడించారు. క్షమాపణ చెప్పడంలో తప్పు ఏం లేదని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.

    ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ గా ఉండే ఆది.. తన స్కిట్ లలోనూ డబుల్ మీనింగ్ పదాలతో చెడుగుడు ఆడేస్తాడు. విమర్శకులను కూడా తన స్కిట్ లో దెప్పి పొడుస్తాడు. ఎక్కడా వెనక్కి తగ్గని ఆది తాజాగా తెలంగాణ సమాజం విషయంలో కాస్త తగ్గడం విశేషం.