Hyper Aadi: విష్ణుపై వ్యాఖ్యల ఫలితం: హైపర్ ఆదిపై దాడి..?నిజమా..?

Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది స్కిట్లు అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ కామెడీ షో లో అందరిని నవ్వించే ఆది బయట మాత్రం వివాదాల్లో చిక్కుకుంటాడు. ఇప్పటి వరకు రాజకీయనాయకులు, సినిమా నటుల మీద జోకులు వేయడంతో హైపర్ ఆదికి చిక్కులే వచ్చాయి. తాజాగా ఈ సూపర్ కమెడియన్ మరో సమస్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ‘మా’ అధ్యక్షుడు విష్ణు పై వేసిన జోకులు వివాదంగా […]

Written By: NARESH, Updated On : November 11, 2021 11:35 am
Follow us on

Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది స్కిట్లు అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ కామెడీ షో లో అందరిని నవ్వించే ఆది బయట మాత్రం వివాదాల్లో చిక్కుకుంటాడు. ఇప్పటి వరకు రాజకీయనాయకులు, సినిమా నటుల మీద జోకులు వేయడంతో హైపర్ ఆదికి చిక్కులే వచ్చాయి. తాజాగా ఈ సూపర్ కమెడియన్ మరో సమస్యలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ‘మా’ అధ్యక్షుడు విష్ణు పై వేసిన జోకులు వివాదంగా మారాయి. ఆయన చేసిన స్కిట్ పై విష్ణు మద్దతుదారులు కొందరు హైపర్ ఆదిపై దాడి జరిగిందని, మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో నిజమా..? కాదా..? అనేది తెలియదు. కానీ హైపర్ ఆది మాత్రం ఈ పోస్టుపై స్పందించడం లేదు.

ప్రతీ పండుగ సందర్భంగా జబర్దస్త్ ప్రత్యేక కామెడీ షో చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా చేసిన షో లో హైపర్ ఆది పాల్గొన్నాడు. ఎప్పటిలాగే ఆది పంచ్ లతో అదరగొట్టాడు. అయితే ఇటీవల మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో విష్ణు చేసిన కొన్ని డైలాగ్ లను జబర్దస్త్ కామెడీషో లో హైపర్ ఆది అనుకరించాడు. అంతేకాకుండా మంచు లక్ష్మి వ్యాఖ్యలను కూడా అనుకరించాడు. దీంతో హైపర్ ఆది చేసిన ఈ స్కిట్ వైరల్ గా మారింది.

అయితే దీనిపై విష్ణు స్పందించాడో లేదో తెలియదు గానీ.. ఆయన మద్దతు దారులు మాత్రం సోషల్ మీడియా వేదికగా మాత్రం ఫైర్ అవుతున్నారు. హైపర్ ఆదిపై సెటైర్లు వేస్తున్నారు. కొందరు ‘డైపర్ ఆదిగాడిని డైపర్ చిరిగేలా కొట్టారు’ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీరు పెట్టిన పోస్టులకు ఆది ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ‘మీవి చీప్ పే టీమ్ బ్యాచ్… ఎప్పుడు ఎవర్ని కొడుదామా..? అని చూస్తారు..’ అని కామెంట్లు పెడుతున్నారు. అయితే మరోవైపు మంచు విష్ణు ఫ్యాన్ష్ హైపర్ ఆదిపై దాడి చేశారని పోస్టుల పెడుతున్నారు.

ఇదిలా ఉండగా మంచు విష్ణుపై హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలకు స్వారీ చెప్పాలని కొందరు డిమాండ్ చేశారట. అయితే ఆది అందుకు నిరాకరించాడట. అయితే ఈ స్కిట్ మంచు విష్ణు పై హైపర్ ఆది చేసిన కామెంట్స్ తొలగించారు. కానీ ఆది చేసిన కామెంట్స్ వల్ల సోషల్ మీడియాలో ఆది ఫ్యాన్స్ వర్సెస్ విష్ణు ఫ్యాన్స్ గా విడిపోయి పోటా పోటీగా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మల్లెమాల ప్రొడక్షన్ మరోసారి ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించిందట.

Also Read: మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” పూజా కార్యక్రమాలు షురూ…

“ఆర్ఆర్ఆర్” టాక్ పైనే ‘బంగార్రాజు’ ఆధారం !