Hyper Aadi Kidnap: ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది కిడ్నాప్ కి గురయ్యాడు. కిడ్నాపర్లు పది గంటల పాటు అన్నం నీళ్లు లేకుండా మాడ్చారు. బుల్లితెర స్టార్ హైపర్ ఆది కిడ్నాప్ కలకలం రేపింది. హైపర్ ఆది జబర్దస్త్ వేదిక చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. టీం మెంబర్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది టీమ్ లీడర్ అయ్యాడు. జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అసలు హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ అన్నట్లు షో సాగేది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం, జబర్దస్త్ లో హైపర్ ఆది టీమ్ ఆడియన్స్ హాట్ ఫేవరేట్ అయ్యాయి.
తర్వాత ఢీ షోకి కూడా వచ్చిన హైపర్ ఆది అక్కడ కూడా తన మార్కు చూపించాడు. ఢీ షోలో యాంకర్స్, జడ్జెస్ మధ్య పేలే పంచ్లు అన్ని హైపర్ ఆది రాసేవే. హైపర్ ఆది వచ్చాక ఢీ షోకి కూడా ఆదరణ పెరిగింది. అలా మొదలైన ప్రస్థానం కొనసాగుతుంది. అయితే హైపర్ ఆది పంచ్లు ఎంత నవ్విస్తాయో అంతే వివాదం రాజేస్తాయి. పలుమార్లు హైపర్ ఆది ఫ్లోలో పంచ్లు వేసి క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు, కొన్ని సామాజిక వర్గాలు, మహిళలను ఉద్దేశిస్తూ ఆయన రాసిన జోక్స్ వివాదాస్పదం అయ్యాయి.
ఆడవాళ్లపై కూడా ఆది పంచులు ఘాటుగా ఉంటాయి. ఆ మధ్య నైటీలు బ్యాన్ చేయాలని అన్నారు. ఆడవాళ్ల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న హైపర్ ఆదికి బుద్ది చెప్పాలని మహిళలు డిసైడ్ అయ్యారు. అతన్ని కిడ్నాప్ చేశారు. బంధించి అన్నం, నీళ్లు లేకుండా మాడ్చారు. హైపర్ ఆది కిడ్నాప్ కలకలం రేపింది. అయితే ఇది నిజమైన కిడ్నాప్ కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్కిట్ మాత్రమే.
పాప్యులర్ సీరియల్ నటీమణులు హైపర్ ఆదిని కిడ్నాప్ చేశారు. ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వనందుకు నీకు శిక్ష అన్నారు. అయితే మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మీరు ఈ శిక్ష వేసినా స్వీకరిస్తానని హైపర్ ఆది చెప్పాడు. ఈ స్కిట్ లో కూడా హైపర్ ఆది తన మార్క్ పంచ్లతో అలరించారు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ఆకట్టుకుంటుంది.