Hyper Aadi Jabardasth: జబర్దస్త్ కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ కమెడియన్ సినిమాల్లో కూడా నటించారు. అయితే తాను చేసే స్కిట్లలో అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు వస్తుంటాయి. కానీ అవన్నీ తుడుచుకుపోయినట్లే కనిపిస్తుంటాయి. ఇక హైపర్ ఆది జబర్దస్త్ లో చేరి ఎన్నాళ్లో అయినా ఆయన చేసే స్కిట్లు కొత్తగా ఉంటాయి. ట్రెండ్ కు తగ్గట్లుగా స్కిట్లు చేస్తూ ముందుకు వెళ్తుంటాడు. తన టీం మెంబర్స్ లో రైజింగ్ రాజు అనే నటుడికి ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన ఓ విషయంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. రైజింగ్ రాజు కోసం హైపర్ ఆది తనలో ఉన్న మానవత్వాన్ని బయటపెట్టాడట. హైపర్ ఆది పంచులపై నచ్చని కొందరు సైతం ఆయన చేసిన ఈ పనిపై అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ హైపర్ ఆది ఏం చేశాడు..?
Also Read: ముద్దులు, హగ్గులు దాటి ఏకంగా బెడ్ పైకి… అరె ఏంట్రా ఇది!

గత కొంత కాలంగా జబర్దస్త్ ప్రొగ్రాంలో హైపర్ ఆది గ్రూపులో రైజింగ్ రాజు కనిపించడం లేదు. సాధారణంగా హైపర్ ఆది, రైజింగ్ రాజు పోటీపడి నటిస్తుంటారు. ఎంతో కాలంగా వీరిద్దరు ఒకే గ్రూపులో కనిపిస్తున్నారు. అయితే రైజింగ్ రాజు కనిపించకపోయేసరికి అందరూ ఆయన గురించి వాకబు చేశారు. ఆయన ఎందుకు కనిపించడం లేదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే హైపర్ ఆది ఆ విషయం బయటపెట్టకపోయినా చేసిన సాయం మరిచిపోవద్దన్నట్లుగా రైజింగ్ రాజు అసలు విషయం చెప్పాడు. దీంతో హైపర్ ఆదిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
‘అసలే కరోనా టైం. అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ సమయంలో పెద్ద పెద్ద సంస్థలే మూతలు పడ్డాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు జీతాల్లేక అల్లాడుతున్నారు. కానీ ఈ గ్యాప్ లో కూడా నాకొచ్చే పేమేంట్ వచ్చింది. ఇదే సమయంలో మనవరాలు పుట్టింది. దీంతో బయటికెళ్తే కరోనా భయం. అందుకనే ఎక్కడికి వెళ్లలేకపోయా. కొందరు పనిని భట్టే జీతాన్ని ఇస్తారు. కానీ ఆయన మాత్రం నా పేమెంట్ ను నెలవారీగా ఇంటికి పంపించాడు. చిన్నవాడైపోయేసరికి ఊరుకున్నాను.. లేకపోతే కాళ్లు మొక్కాలి’ అని రైజింగ్ రాజు అసలు విషయం తెలిపారు.
దీంతో హైపర్ ఆదిపై ఇప్పటి వరకున్న అభిప్రాయాన్ని కొందరు మార్చుకుంటున్నారు. ఆయన కేవలం కామెడీ కోసం స్కిట్లను చేయడమే కాదు ఆయనలో మానవత్వం ఉంది అని నిరూపించుకున్నారు అని అంటున్నారు. ఆయన చేసిన ఈ పని తెలిసిన తరువాత విమర్శకులు సైతం మెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు. ఏదీ ఏమైనా హైపర్ ఆది ఆ సమయంలో తన తోటి కమెడియన్ కు సాయం చేయడమంటే గొప్ప విషయమే అని అనుకుంటున్నారు.
Also Read: పన్నెండో వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది