https://oktelugu.com/

Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కి హైపర్ ఆది గుడ్ బై

Jabardasth Hyper Aadi: ఈటీవీ లో జబర్దస్త్ అనే కామెడీ షో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణం సారథ్యం లో ప్రారంభం అయినా ఈ రియాలిటీ షో సౌత్ లోనే ట్రెండ్ సెట్ చేసిన షో గా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఈ షో ని చూసి ఇతర టీవీ చానెల్స్ వారు కూడా ఇదే రకమైన కామెడీ షోలను నిర్వహించి మంచి TRP రేటింగ్స్ ని సంపాదించారు..జబర్దస్త్ అనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 18, 2022 / 12:19 PM IST
    Follow us on

    Jabardasth Hyper Aadi: ఈటీవీ లో జబర్దస్త్ అనే కామెడీ షో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణం సారథ్యం లో ప్రారంభం అయినా ఈ రియాలిటీ షో సౌత్ లోనే ట్రెండ్ సెట్ చేసిన షో గా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఈ షో ని చూసి ఇతర టీవీ చానెల్స్ వారు కూడా ఇదే రకమైన కామెడీ షోలను నిర్వహించి మంచి TRP రేటింగ్స్ ని సంపాదించారు..జబర్దస్త్ అనే షో ద్వారా ఇప్పటి వరుకు మన తెలుగు సినీ పరిశ్రమ కి ఎంత మంది కమెడియన్స్ పరిచయం అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అలా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన ఈ బిగ్గెస్ట్ కామెడీ షో రాబొయ్యే రోజుల్లో ఇక కొనసాగదు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..విజయవంతంగా ఇనాళ్ళ నుండి కొనసాగుతున్న ఈ కామెడీ షో పై ఇలాంటి వార్తలు రావడం ఏందీ అని ఇప్పుడు పేక్షకుల్లో మెదులుతున్న సందేహం..ఈ వార్తలో నిజానిజాలు ఎంత వరుకు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    ఇక అసలు విషయానికి వస్తే జబర్దస్త్ షో కి ముందుగా వన్నె తెచ్చింది మాత్రం జడ్జిలే అని చెప్పాలి..మెగా బ్రదర్ నాగ బాబు మరియు రోజా గార్లు ఎంతో కాలం నుండి జడ్జీలుగా ఈ షో లో పాల్గొంటూ వచ్చారు..కానీ ఎప్పుడైతే నాగబాబు గారు ఈ షో మానేశారో అప్పటి నుండి ఈ షో కి కాస్త కళ తప్పింది అనే చెప్పాలి..ఆ తర్వాత ఈ షో ద్వారా ప్రేక్షకుల ఆధారణని విపరీతంగా చూసిన ఎంతో మంది కమెడియన్స్ కి వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడం తో వాళ్ళు ఈ తప్పనిసరి పరిస్థితి లో ఈ షో ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది..ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయాడు హైపర్ ఆది..జబర్దస్త్ షో మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు ప్రస్తుతం మంచి TRP రేటింగ్స్ వస్తున్నాయి అంటే దానికి ముఖ్య కారణం హైపర్ ఆది మరియు సుడిగాలి సుధీర్ అని చెప్పొచ్చు..వీళ్లిద్దరు చేసే కామెడీ మినహా..మిగిలిన కమెడియన్స్ చేసే స్కిట్స్ అంతంత మాత్రంగానే క్లిక్ అవుతూ ఉన్నాయి..అయితే ఇప్పుడు హైపర్ ఆది జబర్దస్త్ షో ని వదిలేయబోతుండడం తో ఈ షో మరింత బలహీన పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

    Jabardasth Hyper Aadi

    Also Read: అంతర్జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించిన హీరో మాధవన్ కొడుకు

    హైపర్ ఆదితో పాటుగా పదేళ్ల నుండి ఈ షో లో జడ్జి గా వ్యవహరిస్తున్న రోజా గారు కూడా ఇటీవలే ఆమెకి మంత్రి పదవి రావడం తో ఈ షో ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది..’మంత్రిగా ఎంతో బాధ్యత తో కూడిన పదవి రావడం తో..దానికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసేందుకు నాకు ఎంతో ఇష్టమైన జబర్దస్త్ షో ని వదిలేయాల్సి వస్తుంది’ అంటూ రోజా ఏడుస్తూ మాట్లాడిన ప్రోమో ఒక్కటి యూట్యూబ్ లో తెగ వైరల్ గా మారింది..షో కి మొదటి నుండి ఆయువు పట్టులాగా ఉన్న నాగబాబు , రోజా మరియు హైపర్ ఆది వంటి వారు వెళ్ళిపొయ్యేసరికి ఈ షో పై జనాల్లో మెల్లగా ఆసక్తి తగ్గిపోతున్న మాట వాస్తవమే..గత మూడు వారల నుండి హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించకపొయ్యేసరికి TRP రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి అట..ఇక భవిష్యత్తులో సుడిగాలి సుధీర్ కూడా ఈ షో ని వదిలేస్తే ఇక రన్ చెయ్యడం చెయ్యడం చాలా కష్టం అనే అభిప్రాయం లో ఉన్నాడట మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు..భవిష్యత్తులో ఏదైనా మేజిక్ జరిగి ఈ షో ఇలాగె కొనసాగితే బాగుండును అని అభిమానులు కోరుకుంటున్నారు..మరి వారి కోరికలు ఫలిస్తాయో లేదో చూడాలి.

    Also Read: రోజాపై అలాంటి పంచ్ లు వేసిన రాకెట్ రాఘవ.. ఎత్తుకు ఎదిగిపోయారంటూ?

    Tags