Hyper Aadi Arrested: శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కమెడియన్ హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సెట్ లో ఉన్నవారంతా షాక్ కి గురయ్యారు. హైపర్ ఆది కారణంగా ఓ వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నాడని పోలీసులు తెలియజేశారు. అసలు హైపర్ ఆది అరెస్ట్ కి కారణం ఏమిటో చూద్దాం..

ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి మార్పులు చేశారు. మొదట్నుంచి యాంకర్ గా ఉన్న సుడిగాలి సుధీర్ ని తొలగించారు. అలాగే హైపర్ ఆదితో పాటు రష్మీ గౌతమ్, పూర్ణలను కొత్తగా తీసుకున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను వంటి స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ నుండి తప్పుకోగా హైప్ కోల్పోయింది. దీంతో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ శ్రీదేవి డ్రామా కంపెనీపై ఫోకస్ పెట్టినట్లుంది.
Also Read: Vikram OTT Update: విక్రమ్ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది
లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఆటో రాంప్రసాద్ హైపర్ ఆదికి సన్మానం చేస్తా అన్నాడు. ఇలా సన్మానం చేసే సుధీర్ ని పంపించేశారు, అంటే నన్ను కూడా బయటికి పంపించే ప్లానా?, అంటూ సెటైర్ వేశాడు. ఈ మధ్యలో ఓ అమ్మాయి హైపర్ ఆది నన్ను మోసం చేశాడంటూ వచ్చింది. ముసుగులో వచ్చిన ఆ యువతి ఎవరో అర్థం కాలేదు. కాగా హైపర్ ఆది ఆ అమ్మాయిని ఎలా మోసం చేశాడో.. తెలియజేస్తూ కమెడియన్స్ నరేష్, ప్రసాద్ స్కిట్ చేశారు.

ఎంటర్టైనింగ్ సాగుతున్న షో పోలీసులు ఎంట్రీతో సీరియస్ గా మారిపోయింది. మేనేజర్ బ్రతిమిలాడుతున్నా వినకుండా… ఇద్దరు పోలీసులు నేరుగా స్టేజ్ పైకి వచ్చేశారు. హైపర్ ఆది ఆక్సిడెంట్ చేశాడు. ఓ వ్యక్తి ఇతడి కారణంగా చావుబతుకుల్లో ఉన్నాడు. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం అన్నారు. ఎవరు చెబుతున్నా వినకుండా హైపర్ ఆదిని అరెస్ట్ చేసి తమ వెంట తీసుకుపోయారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
తాజా ప్రోమోలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ప్రోమో చూసిన జనాలు మాత్రం డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ఇలాంటివి చాలా చూశాం, ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని మండి పడుతున్నారు. నిజంగా హైపర్ ఆది అరెస్ట్ అయితే, ఆ వీడియో ఎందుకు విడుదల చేస్తారు. అతడు అరెస్ట్ అయితే ఇప్పటికే మీడియా కోడై కూసేది. కాబట్టి ఇది ఒక ప్రమోషనల్ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు.
Also Read:Ramanaidu Birth Anniversary: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత రామానాయుడు అంటే ఓ హిస్టరీ!
[…] Also Read: Hyper Aadi Arrested: హైపర్ ఆది అరెస్ట్… షో జరుగుతు… […]
[…] Also Read:Hyper Aadi Arrested: హైపర్ ఆది అరెస్ట్… షో జరుగుతు… […]