Homeఎంటర్టైన్మెంట్Hyper Aadi: పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన హైపర్ ఆది... ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ!...

Hyper Aadi: పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన హైపర్ ఆది… ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ! ఇంట్రెస్టింగ్ డిటైల్స్

Hyper Aadi: జబర్దస్త్ వేదికగా పాప్యులర్ అయ్యాడు హైపర్ ఆది. మనోడి నాన్ స్టాప్ పంచ్లు నవ్వుల వర్షం కురిపిస్తాయి. హైపర్ ఆది రైజింగ్ రాజు టీం బుల్లితెర మీద సంచలనాలు చేసింది. కొన్నాళ్లుగా జబర్దస్త్ కి దూరమైన హైపర్ ఆది… శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ రియాలిటీ షోలో సందడి చేస్తున్నాడు. కాగా హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు హైపర్ ఆది దీనిపై స్పందించాడు. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమే అన్నాడు.

హైపర్ ఆది జనసేన పార్టీ వీర విధేయుడు. పవన్ కళ్యాణ్ భక్తుడు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ పై ఎవరు నోరు పారేసుకున్నా హైపర్ ఆది ఊరుకోడు. గతంలో కూడా తన స్కిట్స్ లో పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన వాళ్ళ మీద ఘాటైన మాటల తూటాలు వదిలాడు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో హైపర్ ఆది పాల్గొంటూ ఉంటారు. జనసేన వేదికల మీద హైపర్ ఆది స్పీచ్ లు వింటే గూస్ బంప్స్ కలుగుతాయి.

ఇక జనసేన పార్టీ తరపున హైపర్ ఆది పోటీ చేస్తారనే వాదన బలపడింది . తాజా ఇంటర్వ్యూలో హైపర్ ఆది ఈ వార్తలపై స్పందించాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. ఆయన భావాలు నచ్చి ఫాలో అవుతున్నాను. పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటాను. నేను పదవులు, పార్టీ టికెట్స్ ఆశించి జనసేన కోసం పని చేయడం లేదు. ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. పవన్ కళ్యాణ్ ని గెలిపించడం కోసం నేను గెలుస్తాను.

గతంలో నేను జనసేన పార్టీ కోసం ప్రచారం చేశాను. వచ్చే ఎన్నికల్లో కూడా క్యాంపైన్ చేస్తాను. పవన్ కళ్యాణ్ ని ఎవరైనా విమర్శిస్తే నేను స్పందిస్తాను. పవన్ కళ్యాణ్ ఎవరినీ వ్యక్తిగత విమర్శలు చేయరు. సమస్యల గురించే మాట్లాడతాడు, అని హైపర్ ఆది అన్నాడు. కాబట్టి హైపర్ ఆది ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. జనసేన టీడీపీతో పొత్తులో ఉండగా ఎమ్మెల్యే టికెట్ దొరకడం అంత సులభం కాదు.

RELATED ARTICLES

Most Popular