Hyper Aadi 10th Class Marks: ‘జబర్దస్త్'(Jabardasth) కామెడీ షో ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, తద్వారా వచ్చిన ఫేమ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయం లోనే మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గా హైపర్ ఆది(Hyper Aadi) ఎదిగిన తీరు ఎలాంటిదో మనమంతా కళ్లారా చూసాము. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆయన మరో అలీ లాగా మారిపోయాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఈటీవీ ఛానల్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలు చేస్తున్నాడు. ఇలా చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీ గా హైపర్ ఆది గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు రీసెంట్ గా జరిగిన ఒక షో ద్వారా తెలిసింది. హైపర్ ఆది చిన్నతనం నుండే చదువులో టాప్ గా ఉండేవాడు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, బీటెక్, ఇలా అన్నిట్లోనూ ఆయన మెరిట్ స్టూడెంట్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఆయన జబర్దస్త్ లోకి వచ్చే ముందు కూడా ఒక ప్రముఖ MNC సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తుండేవాడు. కానీ సినిమాల్లోకి రావాలి అనే ఆసక్తితో, జబర్దస్త్ లో ఎలా అయినా అవకాశం సంపాదించాలని ప్రతీ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లేవాడట. అక్కడ అదిరే అభి ఇతన్ని ఒక రోజు చూసి, బాగా నచ్చడం తో తన స్కిట్స్ లోకి తీసుకోవడం మొదలు పెట్టాడు. అక్కడి నుండి మొదలైన హైపర్ ఆది ప్రస్థానం నేడు ఈ రేంజ్ కి చేరుకుంది. ఇదంతా పక్కన పెడితే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ఒక ఎపిసోడ్ లో హైపర్ ఆది కి సంబంధించిన పదవ తరగతి మార్కుల జాబితా ని ఆడియన్స్ కి చూపించారు. ఆ మార్కుల లిస్ట్ ని చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అలా ఉంది అన్నమాట.
తెలుగు లో 85 మార్కులు, ఇంగ్లీష్ లో 87 మార్కులు, మ్యాథ్స్ లో 96, సైన్స్ లో 94, సోషల్ స్టడీస్ లో 92 , హిందీ లో 80 మార్కులు వచ్చాయట. మొత్తం మీద 600 మార్కులకు గానూ 534 మార్కులు వచ్చాయి అన్నమాట. ఆరోజుల్లో ఈ రేంజ్ మార్కులు అంటే సాధారణమైన విషయం కాదు. కేవలం 10వ తరగతి లో మాత్రమే కాదు, ఇంటర్మీడియట్, బీటెక్ లో కూడా ఇదే రేంజ్ మార్కులు వచ్చాయట. ఒకవేళ హైపర్ ఆది జబర్దస్త్ లోకి రాక పొయ్యుంటే ఒక మంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ లో కొనసాగి ఉండేవాడేమో కానీ, డబ్బులు మాత్రం ఇప్పుడు సంపాదిస్తున్న రేంజ్ లో సంపాదించేవాడు కాదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో హైపర్ ఆది ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తాడు అనేది చూడాలి.