Nithiin: విక్రమ్ మూవీ నితిన్ తో పాటు ఆయన పార్టనర్స్ కి భారీ లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మూవీ ఓపెనింగ్స్ చూసిన ట్రేడ్ వర్గాలు ఇదే అంటున్నాయి. నిజానికి కమల్ హాసన్ మార్కెట్ పడిపోయి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక్కటంటే ఒక్క సినిమా కమర్షియల్ సక్సెస్ కొట్టలేదు. దీంతో విక్రమ్ బిజినెస్ చాలా డల్ గా, చివరి నిమిషంలో ఫైనల్ అయ్యింది. ఏపీ/ తెలంగాణా డిస్ట్రిబ్యూషన్ హక్కులను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్ వెంకట్, నాని మేనేజర్ వెంకట్, నిర్మాత ఠాగూర్ మధు కలిసి రూ.6 కోట్లకు కొన్నారు. ఒక్కొక్కరు రూ.1.5 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. ఆంధ్రా/సీడెడ్ హక్కులు రూ.5 కోట్లకు అమ్ముకుని, నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు దగ్గర పెట్టుకున్నారు.

ఇక నైజాం కింగ్ దిల్ రాజుకు ఈ చిత్రాన్ని ఎటువంటి అడ్వాన్స్ తీసుకోకుండా కేవలం 5% కమీషన్ బేసిస్ పై ఇవ్వడం జరిగింది. నైజాంలో విక్రమ్ పై వీరి పెట్టుబడి కోటి రూపాయలు మాత్రమే. కాగా మూడు రోజుల్లోనే విక్రమ్ రూ. 2 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్ లో విక్రమ్ రూ. 5 కోట్ల కంటే ఎక్కువ షేర్ అందుకోవచ్చు. దీంతో నితిన్ అండ్ కో.. ఒక్కొక్కరు కోటి రూపాయలకు పైగా ఆర్జించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రా హక్కులు నాలుగు కోట్ల రేషియోలో అమ్మారు. ఉత్తరాంధ్ర హక్కులు రూ. 95 లక్షలకు అమ్మారు. ఉత్తరాంధ్రలో విక్రమ్ షేర్ ఇప్పటికే రూ.80 లక్షలు దాటేసింది.
Also Read: Girls Fighting: ఒక్క బాయ్ ఫ్రెండ్ కోసం అమ్మాయిలు ఇలా నడిరోడ్డుపై కొట్టుకున్నారు.. వైరల్
ఏపీలో కూడా విక్రమ్ మూవీ బయ్యర్లకు లాభాల కురిపించడం ఖాయం. ఇక చాలా కాలం తర్వాత డబ్బింగ్ మూవీ తెలుగులో సత్తా చాటుతుంది. ఒకప్పుడు అపరిచితుడు, గజిని, చంద్రముఖి వంటి డబ్బింగ్ చిత్రాలు తెలుగులో రికార్డు వసూళ్లు సాధించాయి. మళ్ళీ ఆ ట్రెండ్ విక్రమ్ మూవీతో రిపీట్ అయ్యింది.

దర్శకుడు లోకేష్ కనకరాజ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విక్రమ్ తెరకెక్కించారు. కమల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేశారు. హీరో సూర్య గెస్ట్ రోల్ చేయడం జరిగింది. ఇక వరల్డ్ వైడ్ గా విక్రమ్ రెండు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా మూవీ రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకెళుతుంది.
Also Read:Samantha- Preetham jukalker: ప్రీతమ్ జుకల్కర్ తో సమంత డేట్ నైట్.. వైరల్ ఫొటో
Recommended Videos
[…] Also Read: Nithiin: నితిన్ సుడి తిరిగింది… విక్రమ్ తో… […]