Balakrishna: ఎఫ్ 3 మూవీ చూశాక బాలయ్య థింకింగ్ మారిపోయిందన్న వార్త ప్రచారం అవుతుంది. తన నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడికి ఆయన సూచనలు చేశారట. ఆ విషయం ఏమిటో చూద్దాం. దర్శకుడు అనిల్ రావిపూడి మంచి ఎంటర్టైనింగ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రవితేజ, మహేష్ వంటి కమర్షియల్ హీరోల చిత్రాలలో కూడా నాన్ స్టాప్ కామెడీ పంచారు. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల తర్వాత అనిల్ రావిపూడి తెరపై కామెడీ పండించడంలో దిట్టగా నిరూపించుకున్నాడు. ఇటీవల విడుదలైన ఎఫ్3కి సూపర్ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెంకీ, వరుణ్ ల కామెడీకి కనెక్ట్ అయ్యారు.

ఎఫ్3 చిత్రాన్ని బాలయ్యకు స్పెషల్ స్క్రీనింగ్ వేయడం జరిగింది. ఎఫ్3 మూవీ చూసిన బాలయ్య చాలా ఇంప్రెస్ అయ్యాడట. సినిమాలో కామెడీ, క్యారెక్టరైజేషన్ నచ్చడంతో తన మూవీలో కూడా మంచి ఫన్ ఉండేలా కామెడీ ట్రాక్స్ రాయాలని అనిల్ రావిపూడికి సూచించారట. సీరియస్ సబ్జెక్టు అయినప్పటికీ కామెడీ కూడా ఉండేలా స్క్రిప్ట్ కి మార్పులు చేయాలని కోరారట. ఇక బాలయ్య చెబితే చేసేదేముంది. అనిల్ రావిపూడి ఎస్ అనడంతో పాటు తన రైటింగ్ టీమ్ తో కలిసి ఇదే పనిలో ఉన్నాడట.
Also Read: Nithiin: నితిన్ సుడి తిరిగింది… విక్రమ్ తో పెట్టుబడికి రెట్టింపు లాభం!
బాలకృష్ణ 108వ చిత్రం అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్నాడు. పెళ్లిసందడి (2022) మూవీతో యూత్ ని ఆకట్టుకున్న శ్రీలీల ఈ చిత్రంలో బాలయ్య కూతురు రోల్ చేయడం విశేషం. అనిల్ రావిపూడి బాలయ్య రోల్ చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నాడట. ఓ బలమైన కథతో తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. ఇక అనిల్ రావిపూడి చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేస్తాడు. కాబట్టి ఈ చిత్రం 2023 సమ్మర్ కానుకగా విడుదలయ్యే సూచనలు కలవు.

ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. బాలకృష్ణ మాస్ లుక్ ఫ్యాన్స్ ని మెప్పించింది. జై బాలయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:Virata Parvam: విరాటపర్వం ప్రీరిలీజ్ లో అపశృతి.. పగబట్టిన ప్రకృతి
Recommended Videos