Sankranti Amanam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గడిచిన రెండు దశాబ్దాలలో వెంకటేష్ కి ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చిన సినిమా మరొకటి లేదు. పండగ వరకు బాగానే ఆడుతుంది, తర్వాత వసూళ్లు తగ్గిపోతాయని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి పండగ సెలవులు పూర్తిగా ముగిసిన తర్వాత కూడా వసూళ్ళలో ఎలాంటి డ్రాప్స్ నిన్న మొన్నటి వరకు లేవు. కానీ నిన్న మాత్రం 8వ రోజు వచ్చిన వసూళ్లతో పోలిస్తే భారీగా తగ్గాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. 8వ రోజు బుక్ మై షో లో ఈ చిత్రానికి లక్ష 20 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కానీ 9వ రోజు మాత్రం అది 65 వేలకు పడిపోయింది. కానీ ఆఫ్ లైన్ లో మాత్రం భారీగానే టికెట్స్ అమ్ముడుపోయాయని టాక్.
ఓవరాల్ గా చూసుకుంటే 9వ రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 3 కోట్ల 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 102 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాలకు కలిపి 122 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకున్నారు. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది ఈ వీకెండ్ తో తేలనుంది. వీకెండ్ తో పాటు సోమవారం (రిపబ్లిక్ డే) కూడా ఈ చిత్రానికి కలిసి రానుంది. ఆరోజు నేషనల్ హాలిడే కావడంతో, ఆ ఒక్క రోజు నుండే 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం దాదాపుగా 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ రికార్డు ని ఫుల్ రన్ లో ఈ సినిమా దాటుతుండగా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఒకవేళ ఆ స్థాయి వసూళ్లు వస్తే, వెంకటేష్ చరిత్ర తిరగరాసినవాడు అవుతాడు. ఎందుకంటే నేటి తరం సూపర్ స్టార్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మరియు రామ్ చరణ్ వంటి వారు కూడా ఈ సినిమా వసూళ్లను దాటలేదు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ వసూళ్లకు దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. కానీ వెంకటేష్ మాత్రం వాటిని అధిగమించి చరిత్ర సృష్టించిన వాడు అవుతాడా లేదా అనేది ఈ వీకెండ్ తో తేలిపోనుంది.