Rajamouli Mahesh Babu Movie: దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ విషయంలో రాజమౌళి భారీ మార్పులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాజమౌళి తన టీం మొత్తాన్ని ప్రతి సినిమాకి కంటిన్యూ చేస్తూ ఉంటాడు.
టీమ్ లో ఒకటి, రెండు చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ, సినిమాకి ముఖ్య పిల్లర్లు గా భావించే మ్యూజిక్ డైరెక్టర్ గాని, సినిమాటోగ్రాఫర్ లా విషయంలో గానీ రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉంటూ తన గత సినిమాలకి వర్క్ చేసిన వాళ్ళని ఈ సినిమాలకి కూడా కంటిన్యూ చేస్తూ వస్తుంటాడు. కానీ ఇప్పుడు రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా కొనసాగుతూ వస్తున్న సెంథిల్ కుమార్ అనూహ్యంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక అతని ప్లేస్ లో ‘పి ఎస్ వినోద్ ‘ ను ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పటికే పీఎస్ వినోద్ అలా వైకుంఠపురంలో, సీతారామం లాంటి సినిమాలకు వర్క్ చేసి తన విజువల్స్ తో ప్రేక్షకులను మ్యాజిక్ చేశాడు. ఇక ఈ సినిమా నుంచి సెంథిల్ తప్పుకున్నట్టుగా రాజమౌళికి చెప్పగానే రాజమౌళి అతని ప్లేస్ ను పిఎస్ వినోద్ తో భర్తీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో కూడా పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. మరి ఇలాంటి సమయంలో తను రాజమౌళితో వర్క్ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి ఈ సినిమాలో తన మార్కు చూపించాలని వినోద్ చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అందువల్లే ఆయన ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేయలేకపోతున్నాడు. కానీ తొందరలోనే ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని రాజమౌళి తెలియజేబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…