https://oktelugu.com/

Krrish 4 : ఎప్పుడో ప్రకటించినా పట్టాలెక్కని క్రేజీ సీక్వెల్.. అసలు కారణం ఇదే !

2000లో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్ మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ గా మారిపోయాడు. అయితే, ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో అతని కెరీర్ సంక్షోభంలో పడింది.

Written By: , Updated On : February 5, 2025 / 02:09 PM IST
Krrish 4

Krrish 4

Follow us on

Krrish 4 : 2000లో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్ మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ గా మారిపోయాడు. అయితే, ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో అతని కెరీర్ సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితిలో 2003లో వచ్చిన ‘కోయీ మిల్ గయా’ హృతిక్ కెరీర్‌కు మళ్లీ గాడి పట్టించింది. ఆయన తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించిన ఈ సైన్స్-ఫిక్షన్ మూవీ పెద్ద హిట్ అయ్యింది. దాని సీక్వెల్‌గా వచ్చిన 2006లో వచ్చిన ‘క్రిష్’, 2013లో వచ్చిన క్రిష్ 3 కూడా ఘన విజయం సాధించాయి. క్రిష్ 3 వచ్చి 11 ఏళ్లు గడిచిపోయినా.. ‘క్రిష్ 4’ ఇంకా పట్టాలెక్కలేదు. 2018లోనే స్క్రిప్ట్ రెడీ అయింది కానీ ఇప్పటికీ సినిమా ప్రారంభం కాకపోవడానికి పెద్ద కారణం ఫండింగ్ సమస్య అని రాకేష్ రోషన్ స్వయంగా వెల్లడించారు.

బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంఛైజీ ‘క్రిష్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు మూడు భాగాలు వచ్చి బాక్సాఫీసు వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. దాని తర్వాత సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ సెట్స్ మీదకు వెళ్లకపోవడానికి ప్రధాన కారణం బడ్జెట్ అని ఆ సినిమా దర్శకనిర్మాత రాకేష్ రోషన్ స్పష్టం చేశారు.

ఈ సినిమాలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు క్రిష్ మూడు భాగాలు విడుదలయ్యాయి. ఇప్పుడు అభిమానులు క్రిష్ 4 గురించి చాలా కాలంగా ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు దర్శక నిర్మాత రాకేష్ రోషన్ పై భారీ అంచనాలు ఉండడంతో కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

క్రిష్ 3 గురించి రాకేష్ రోషన్ ఏమన్నారు?
గానాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్ మాట్లాడుతూ.. ‘నేను చాలా సంవత్సరాలుగా వేచి చూస్తున్నాను కానీ నా బడ్జెట్ సెట్ కావడం లేదు. చిత్రం స్కేల్ పెద్దది. నేను స్కేల్ తగ్గిస్తే అది సాధారణ చిత్రంలా కనిపిస్తుంది. ఆ ప్రపంచం చిన్నదవుతుంది. ఈ రోజుల్లో పిల్లలు సూపర్ హీరోల చిత్రాలను చాలా చూశారు. చిన్న తప్పు చూసినా వెంటనే విమర్శిస్తారు.మేము దీని గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాము. మనం ఆ స్కేల్ (మార్వెల్, DC) చిత్రాలను తయారు చేయలేము. మా దగ్గర అంత డబ్బు లేదు. మా బడ్జెట్ అలా చేయడానికి మాకు అనుమతి ఇవ్వదు. మనం కథపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అయితే, చిత్రంలో పెద్ద సన్నివేశాలు ఉంటాయి.’ అన్ని అన్నారు.

అంతకుముందు, రాకేష్ రోషన్ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. క్రిష్ 4 ఫ్రాంచైజీలో అతిపెద్ద చిత్రం అవుతుందని అన్నారు. కానీ సినిమా బడ్జెట్ ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. అయితే, రాకేష్ రోషన్ సినిమా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. కానీ దానికి కొంత సమయం పట్టవచ్చు. క్రిష్ మొదటి భాగం 2003లో కోయి మిల్ గయా పేరుతో విడుదల అయింది. ఈ చిత్రంలో ప్రీతి జింటా, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘ఫైటర్’, ‘వార్ 2’ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈలోగా ‘క్రిష్ 4’ కు సరైన నిర్మాణ సంస్థ దొరికితే, త్వరలోనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.