https://oktelugu.com/

Hrithik Roshan: స్టార్ హీరో ఆమెతో… స్టార్ భార్య ఆయనతో.. కలిసి పార్టీ చేసుకున్నారు

Hrithik Roshan: బాలీవుడ్ హీరోల్లో అందగాడు ఎవరు అంటే.. ముందు వరుసలో చెప్పుకోవాల్సిన హీరో ‘హృతిక్ రోషన్’. అలాంటి హీరో భార్యతో విడిపోయాక, ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడలేదు. మధ్యలో కొంత బ్రేక్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. మరి ఈ బ్రేక్ లోనే ‘హృతిక్ రోషన్’కి ఒక చిన్న హీరోయిన్ కనెక్ట్ అయింది. ‘హృతిక్ రోషన్’ ప్రేమిస్తున్నాడు అంటే.. ఏ స్టార్ హీరోయినో అయ్యి ఉంటుంది అని ఊహించుకుంటారు. కానీ, ‘హృతిక్’ మాత్రం చాలా భిన్నంగా యువ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 7, 2022 / 06:17 PM IST
    Follow us on

    Hrithik Roshan: బాలీవుడ్ హీరోల్లో అందగాడు ఎవరు అంటే.. ముందు వరుసలో చెప్పుకోవాల్సిన హీరో ‘హృతిక్ రోషన్’. అలాంటి హీరో భార్యతో విడిపోయాక, ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడలేదు. మధ్యలో కొంత బ్రేక్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. మరి ఈ బ్రేక్ లోనే ‘హృతిక్ రోషన్’కి ఒక చిన్న హీరోయిన్ కనెక్ట్ అయింది. ‘హృతిక్ రోషన్’ ప్రేమిస్తున్నాడు అంటే.. ఏ స్టార్ హీరోయినో అయ్యి ఉంటుంది అని ఊహించుకుంటారు.

    Hrithik Roshan

    కానీ, ‘హృతిక్’ మాత్రం చాలా భిన్నంగా యువ నటి, సింగర్ సబా ఆజాద్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెతో డేటింగ్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెను తరుచుగా కలుస్తున్నాడు. ఇటీవల ముంబైలో వీరిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. సబా ఆజాద్ ప్రస్తుతం “రాకెట్ బాయ్స్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆమె వయసు 32 సంవత్సరాలు. ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు.

    అయితే.. ఉన్నట్టు ఉండి.. హృతిక్ రోషన్, అతడి మాజీ భార్య సుస్సానే ఖాన్‌ ను కలుసుకున్నాడు. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. మళ్లీ వీరిద్దరూ కలిసిపోతున్నారా అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అలాంటిది ఏమి లేదు. కాకపోతే, సుస్సానే గోవాలో ఓ కేఫ్ ప్రారంభించిన సందర్భంగా మాజీ భర్త హృతిక్‌తోపాటు అతడి లవర్‌కు పార్టీ ఇచ్చింది.

    Hrithik Roshan

    ఈ విషయాన్ని పూజా బేడీ వెల్లడిస్తూ.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, అతడి మాజీ భార్య సుస్సానే ఖాన్‌ను మళ్లీ ఒకేచోట చూడటం ఆనందంగా ఉందని చెప్పింది. హృతిక్ ప్రస్తుతం సబా ఆజాద్‌తో ఎలా అయితే ప్రేమలో ఉన్నాడో.. సుస్సానే కూడా అర్స్‌లాన్ గోనీతో ప్రేమాయణం నడిపిస్తోంది. మొత్తానికి వేరే వేరే వ్యక్తులతో సరసాలు ఆడుతూ కూడా ఈ జంట ఇంకా సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేయడం విశేషం.

    ఏది ఏమైనా హృతిక్ రోషన్ ‘గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. పుట్టుకతో వచ్చిన లోపాలను అణిచి, పట్టుదలతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో వెండితెర పై కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన హీరో హృతిక్ రోషన్.

    Tags