Hrithik Roshan Childhood Pic: పైన చూస్తున్న ఫొటోలో అమితాబ్(Amitabh Bachchan) వైపు చూస్తున్న ఆ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా?, అతని తండ్రి ఒక ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు కూడా. అన్ని విభాగాల్లోనూ ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరితో కలిసి పని చేసాడు, ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. ఆయన కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్. ఇండియా లో ఉన్న హాలీవుడ్ హీరో అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్, యాక్టింగ్ దగ్గర నుండి డ్యాన్స్ వరకు బాలీవుడ్ లో ఈ క్రేజీ హీరో కి పోటీ ని ఇచ్చేవాళ్లే లేరు. అతని పక్కన డ్యాన్స్ వేస్తే ఎలాంటి డ్యాన్సర్ అయినా డామినేట్ అవ్వాల్సిందే. చాలా సింపుల్ గా తన గ్రేస్ తో అవలీలగా ఎవరినైనా డామినేట్ చేయగలడు. అతను మరెవరో కాదు, హృతిక్ రోషన్(Hrithik Roshan).
బాలనటుడిగా, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన హృతిక్ రోషన్, 2000 సంవత్సరం లో ‘కహోనా ప్యార్ హై’ అనే చిత్రం తో హీరో గా వెండితెర అరంగేట్రం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి సినిమాతోనే యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన ‘కభీ ఖుషి..కభీ గామ్’ అనే చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత హృతిక్ రోషన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, లవ్ స్టోరీస్,యాక్షన్ మూవీస్ తో బాలీవుడ్ లో ఖాన్స్ తర్వాత తానే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ఇకపోతే రీసెంట్ గానే ఆయన జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తో కలిసి నటించిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: ‘బిగ్ బాస్ 9’ లోకి కంటెస్టెంట్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే సతీమణి..!
తెలుగు లో ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, హిందీ లో మాత్రం భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కేవలం మూడు రోజుల్లోనే హిందీ వెర్షన్ లో 160 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నేటి తో 200 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరనుంది. రేపటి నుండి స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఫ్లాప్ టాక్ తో కూడా ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయంటే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం తర్వాత ఆయన KGF మేకర్స్ తో ఒక సినిమా చేయనున్నాడు. దీనితో పాటు తన స్వీయ దర్శకత్వం లో ‘క్రిష్ 4’ కూడా చేయనున్నాడు.