Hrithik Roshan: యంగ్ హీరోయిన్ తో స్టార్ హీరో పెళ్లి.. రుజువు ఇదే !

Hrithik Roshan: హృతిక్ రోషన్ అంటే.. బాలీవుడ్ లో స్టార్ హీరో. అలాంటి స్టార్ హీరో ఒక యంగ్ హీరోయిన్ సబా ఆజాద్‌ తో ప్రేమలో పడతాడా ? ఇది పుకారు అనుకున్నారు. గతకొంత కాలంగా వీరు తరచూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు అని కూడా బాగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ జంట ఆ పుకార్లను నిజం చేసింది. తాజాగా వీరిద్దరూ మంగళవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. పైగా ఒకరి చేతిలో ఒకరు ప్రేమగా […]

Written By: Shiva, Updated On : April 5, 2022 7:07 pm
Follow us on

Hrithik Roshan: హృతిక్ రోషన్ అంటే.. బాలీవుడ్ లో స్టార్ హీరో. అలాంటి స్టార్ హీరో ఒక యంగ్ హీరోయిన్ సబా ఆజాద్‌ తో ప్రేమలో పడతాడా ? ఇది పుకారు అనుకున్నారు. గతకొంత కాలంగా వీరు తరచూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు అని కూడా బాగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ జంట ఆ పుకార్లను నిజం చేసింది. తాజాగా వీరిద్దరూ మంగళవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. పైగా ఒకరి చేతిలో ఒకరు ప్రేమగా చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు.

Hrithik Roshan

పబ్లిక్ గానే ఒకరి పై ఒకరు చూపించుకున్న ఆప్యాయతను బట్టి ఈ జంట ఏ స్థాయిలో ప్రేమలో మునిగి తేలుతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద, ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని వినిపిస్తున్న పుకార్లు ఇప్పుడు నిజాలు అయ్యాయి. వీరి తాజా రొమాన్స్ వీరి మధ్య ఉన్న ప్రేమను కన్ఫర్మ్‌ చేసేసింది. దాంతో బాలీవుడ్ మీడియా హృతిక్ రోషన్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలను వైరల్ చేస్తోంది.

Also Read: Nara Rohit: ప్చ్.. ఎట్టకేలకు పొట్ట పై ఫోకస్ పెట్టిన హీరో

నిజానికి గతంలో కూడా నటి సబా ఆజాద్‌తో కలిసి హృతిక్ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు. పైగా సబాను ఇంటికి సైతం తీసుకెళ్లాడు. హృతిక్ కుటుంబంతో కలిసి లంచ్ చేసిన సబా ఫొటోలు కూడా ఆ మధ్య వైరల్ అయ్యాయి. ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్టులో వీళ్లు కనిపించిన తీరుకి హృతిక్‌, సబా త్వరలో ఒక ఇంటివారు కాబోతున్నారని క్లారిటీ వచ్చింది.

ఏది ఏమైనా హృతిక్ రోషన్ ‘గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. నిజంగా హృతిక్ జీవితం నమ్మశక్యం కానిది. హృతిక్ రోషన్ కి చిన్నతనంలో ఎక్కువగా నత్తి ఉండేది. ఆ నత్తి బాధతో అతను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డాడు. అలాగే అతనికి ఇంకా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.

Hrithik Roshan and-Saba-Azad

అయితే ఏం ? పుట్టుకతో వచ్చిన ఆ లోపాలను అణిచి, పట్టుదలతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో వెండితెర పై కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన హీరో హృతిక్ రోషన్. హీరో అయిన తొలిరోజుల్లో అసలు హృతిక్ ను హీరోగా భావించేవాళ్ళు కాదు. అయితే, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు హృతిక్.

Tags