Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన జీరో నుంచి మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదగడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. చాలా మంది ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉండి కూడా ఇక్కడ సక్రమంగా రాణించలేకపోతుంటే ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ప్రేక్షకులను మెప్పించి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అంటే చిరంజీవి ఎంత టాలెంటెడ్ హీరోని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి మొదటి సినిమా అయిన పునాదిరాళ్లు సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా స్క్రీన్ నేమ్ గా ఏం పేరు వేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు శివశంకర వరప్రసాద్ అని చిరంజీవి తన పేరుని చెబితే ఆ పేర్ స్క్రీన్ నేమ్ గా పని చేయదు అని ఆ సినిమా దర్శకుడు చెప్పారట. దాంతో ‘శివశంకర్ వర ప్రసాద్’ పేరును మార్చుకోవాలని చూశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకరోజు రాత్రి పడుకున్న తర్వాత హనుమాన్ టెంపుల్ లో ఒకతను కనిపించి శివ శంకర్ వరప్రసాద్ ను చూస్తూ చిరంజీవి ఇలారా అని పిలిచారట.
దాంతో చిరంజీవి ఎవరిని పిలుస్తున్నావు అని అడిగితే నిన్నే ఇలా రా చిరంజీవి అని పిలచాడట. ఇక దాంతో ఆ నెక్స్ట్ డే ఆ కలని చిరంజీవి వాళ్ళ అమ్మకి తెలియజేశారట. అప్పుడు వాళ్ళ అమ్మ చిరంజీవి అంటే ఆంజనేయుడికి మరొక పేరు కాబట్టి ఆ పేరును నువ్వు పెట్టుకొ అని చెప్పడంతో చిరంజీవి ఈ పేరుని తన స్క్రీన్ నేమ్ గా పెట్టుకొని అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా స్టార్ డమ్ ప్రకారం పీక్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయనను బీట్ చేసే హీరోలు ఇండస్ట్రీలో లేకపోవడం విశేషం..ఇక ఇప్పటికీ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.
కాబట్టి చిరంజీవి ఇన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఆయన ఏ స్టేజ్ లో కూడా రిలాక్స్ అవ్వలేదు. ప్రతి ఒక్క సిచువేషన్ లో తనను తాను గట్టిగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఇక ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు…