Allu Arjun : పుష్ప (Pushpa) సినిమాతో తనకంటూ పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)… పుష్ప (Pushpa 2) సినిమాతో 1950 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడంతో ఆయన ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న హీరోగా మరోసారి భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు ఎప్పుడూ ఇండస్ట్రీని ఏలుతూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ (trivikram) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్లో తెరకెక్కుతుందనే విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక పుష్ప 2 (Puspa 2) సినిమా కోసం 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
కాబట్టి ఈ సినిమాకి దానికి ఏ మాత్రం తగ్గకుండా 350 నుంచి 400 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 700 కోట్ల వరకు అవుతుందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడు. భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అని ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
త్రివిక్రమ్ ఈ సినిమా తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు. పాన్ ఇండియాలో తనన మించిన దర్శకుడు లేడు అనే రేంజ్ లో త్రివిక్రమ్ ఈ సినిమాని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. నిజంగానే త్రివిక్రమ్ ఆ రేంజ్ లో సినిమాను చేయగలడా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిచయమైన త్రివిక్రమ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలని ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారట. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాకి భారీ రేంజ్ లో బడ్జెట్ ను కేటాయించి ముందుకు సాగుతూ ఉండటం విశేషం…మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…